Advertisement
Google Ads BL

‘యశోద’.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?


హరి-హరీష్ ద్వయం దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత నటించిన సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘యశోద’ చిత్రం.. శుక్రవారం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. మార్నింగ్ షోల కంటే కూడా ఈవినింగ్ మరియు నైట్ షోలకు కలెక్షన్స్ బాగా పెరిగినట్లుగా సమాచారం. సరొగసి విధానంలో జరుగుతున్న మెడికల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఆకర్షిస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం హిట్టు చిత్రంగా నిలబడే అవకాశం అయితే ఉంది. 

Advertisement
CJ Advs

 

ముఖ్యంగా సమంత యాక్టింగ్‌కు ప్రేక్షకులే కాకుండా విమర్శకులు సైతం మంచి కితాబిస్తున్నారు. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటన కూడా ఈ ఎమోషనల్ డ్రామాకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక విషయంలోకి వస్తే.. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. రూల్స్ ప్రకారం విడుదలైన 8 వారాల తర్వాత ‘యశోద’ అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కి రానుందని తెలుస్తుంది. సినిమా విడుదలైన 5 భాషల హక్కులను భారీ ధరకు అమెజాన్ సంస్థ పొందినట్లుగా సమాచారం. నిర్మాతకు థియేట్రికల్ హక్కులు కాకుండా.. ఇతర రైట్స్ రూపంలోనే ఈ సినిమా బడ్జెట్ రికవరీ అయినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Samantha Starring Yashoda Movie OTT Release Details:

Yashoda Movie OTT Streaming after 8 weeks to movie Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs