Advertisement
Google Ads BL

ఆ అగ్రనటి మళ్లీ వస్తోంది


మరో అగ్రనటి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఒకప్పటి టాప్ హీరోయిన్లు.. ఈ మధ్య రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అమల, కస్తూరి, రాశి, ఆమని, మధుబాల వంటి వారంతా ఈ మధ్య బిజీ తారలుగా మారిన విషయం తెలియంది కాదు. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌ల నిర్మాణం ఎక్కువైంది. వాటి కోసం నటీనటుల అవసరం కూడా బాగా పెరిగిపోయింది. దీంతో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న వారందరికీ మార్గం ఈజీ అయిపోయింది. ఇప్పుడో వెబ్ సిరీస్ ద్వారా ఒకప్పటి అగ్రతార రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ అగ్రనటి ఎవరో కాదు.. గౌతమి. 

Advertisement
CJ Advs

 

కమల్ హాసన్, గౌతమి కాంబినేషన్‌లో 2015లో ‘పాపనాశం’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత గౌతమి నటించలేదు. అప్పటి వరకు కమల్ హాసన్‌తో సహజీవనంలో ఉన్న గౌతమి.. సడెన్‌గా తెగదెంపులు చేసుకుని ఇప్పుడు సింగిల్‌గానే ఉంటుంది. వారిద్దరి మధ్య గొడవలకు కారణం ఏమిటనేది పక్కన పెడితే.. గౌతమి మాత్రం ఆ మధ్య కమల్‌పై చేసిన ఘాటైన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత గౌతమి పొలిటికల్ ఎంట్రీ అనేలా వార్తలు వచ్చాయి కానీ.. కార్యరూపం దాల్చలేదు. మళ్లీ ఇప్పుడు ఆమె గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వెబ్ సిరీస్‌లో ఆమె కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పిందని, త్వరలోనే ఆమె ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొనబోతుందనేలా కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

One More Senior Actress Ready to Re-Entry:

Senior Actress&nbsp;<span>Gautami Re entry with Web Series</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs