బిగ్ బాస్ సీజన్ 6 లో ఇప్పటివరకు చాలామంది స్ట్రాంగ్ ప్లేయర్స్ అనుకున్నవాళ్ళు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి వెళ్లిపోయారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం అటుంచి.. ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకుంటూ అరుస్తూ హైలెట్ అవుతున్న వారిలో ఇనాయ నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది. మొదటి నుండి గేమ్ పరంగా కన్నా ఆమె నోరు పరంగానే హైలెట్ అయ్యింది. తాజాగా కెప్టెన్సీ టాస్క్ లో ఇనాయ ఫస్ట్ రౌండ్స్ లోనే అవుట్ అవడంతో ఆమె చాలా ఇరిటేషన్ లో ఉంది. అందుకే చివరి రౌండ్ లో ఫైమా గెలిచి ఆమె కెప్టెన్ అవడం ఇనాయ తట్టుకోలేక ఆది రెడ్డితో గొడవేసుకుంది. ఫైనల్ గా శ్రీ సత్య, అది రెడ్డి, ఫైమా బరిలో ఉండగా.. ఆది రెడ్డి శ్రీ సత్య ని అవుట్ చెయ్యగా.. చివరికి అది రెడ్డి కూడా అవుటయ్యాడు. దానితో ఫైమా గెలిచి కెప్టెన్ అయ్యింది
కానీ ఇనాయ మీరు కావాలనే ఫైమాని గెలిపించారు.. అలాగే ఇద్దరిని గెలిపించి గీతూ ఇక్కడినుండి వెళ్ళిపోయింది.. ఇప్పుడు మీరు మొదలు పెట్టారు అంటూ వాదనకు దిగింది. దానితో అది రెడ్డికి కోపం వచ్చింది. నేను గనక ఆ పిల్లతో కలిసి ప్లాన్ చేసి ఆ పిల్లని గెలిపించాను అని నాగార్జున సర్ చెప్పినా, నువ్ నిరూపించినా గేట్లు తన్నుకుంటూ నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను, అది రెడ్డి తప్పు చెయ్యడు.. యా పోమ్మా అంటూ ఇనయతో వెటకారమాడాడు.