Advertisement
Google Ads BL

అషు రెడ్డి.. ఇప్పుడా వీడియో ఎందుకు?


బిగ్ బాస్ భామ అషు రెడ్డిపై ఈ మధ్య ఏ విధంగా ట్రోలింగ్ జరుగుతుందో.. సోషల్ మీడియా చూస్తే తెలిసిపోతుంది. ముఖ్యంగా ఆమె వేసుకునే డ్రస్, ఆమె పెంచిన గ్లామర్ డోస్‌పై నెటిజన్లు కొందరు ఆసక్తిని కనబరుస్తుంటే.. మరికొందరు మాత్రం.. తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఆడపిల్ల లక్షణాలే లేకుండా పోయాయ్.. అంతగా హద్దులు దాటే బదులు.. పోయి బూతు చిత్రాలు చేసుకోవచ్చుగా.. అంటూ కాస్త ఘాటుగానే కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్‌తో తనపై విమర్శలు చేస్తున్న వారందరిపై.. తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్ వేదికగా ఓ వీడియోతో అషు కౌంటరేసింది.

Advertisement
CJ Advs

 

‘దేశముదురు’ సినిమాలోని రమాప్రభ డైలాగ్‌ని ప్లే చేస్తూ.. తనని విమర్శించేవారందరికీ ఇదే నా సమాధానం అన్నట్లుగా తన లిప్ సింక్ చేసింది. ఈ వీడియోలో రమాప్రభ చెప్పిన ‘‘కామా తురాణం నభయం నలజ్జ’’.. ‘‘కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవకి సిగ్గు, లజ్జ, భయం, భక్తి ఉండవు’’ డైలాగ్‌తో.. నన్ను చూడాల్సిన విధంగా చూడండి.. కామపు కళ్లతో కాదు అనేలా అషు కౌంటర్ సంధించింది. అయితే.. ఈ వీడియోలో కూడా ఆమె కురచ దుస్తులలో క్లీవేజ్ షో చేయడం విశేషం.  మొత్తంగా అయితే.. ‘‘మీరేం చేసుకుంటారో చేసుకోండి.. నేను మాత్రం ఆరబోతలో తగ్గేదే లే..’’ అన్నట్లుగా అషు ఈ వీడియోతో జవాబిచ్చిందని నెటిజన్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.

Ashu Reddy Shocking Video on Netizens:

Ashu Reddy posted video on who criticized her
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs