విజయ్ దేవరకొండ లైగర్ ప్లాప్ తో కాస్త సతమతమయినా.. మళ్ళీ మాములు అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. లైగర్ కి ప్రాణం పెట్టి పని చేశాను అని, కానీ అనుకున్న ఫలితం లైగర్ ఇవ్వలేదని, అయినప్పటికీ మంచి కమ్ బ్యాక్ తో మీ ముందుకు వస్తాను అంటూ విజయ్ దేవరకొండ అభిమానులకి మాటిచ్చాడు. అయితే విజయ్ దేవరకొండ ఉన్నట్టుండి తన హెల్త్ పై అప్ డేట్ ఇచ్చాడు. లైగర్ విడుదలకు ముందు అంటే ఓ ఎనిమిది నెలలకు ముందు విజయ్ దేవరకొండ భుజానికి గాయమవగా.. అతను ఆ నొప్పికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే లైగర్ షూటింగ్ తో పాటుగా, లైగర్ ప్రమోషన్స్ లోను పాల్గొన్నాడు.
ఆ భుజం నొప్పొతో కొన్ని నెలలుగా సత్తమతమవుతున్న విజయ్ దేవరకొండ ఆ నెప్పి నుండి పూర్తిగా కోలుకున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా తన హెల్త్ అప్ డేట్ ఇచ్చాడు. 8 నెలల చికిత్స తర్వాత నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని.. బీస్ట్ బయటకు రావడానికి ఉబలాటపడుతోంది. అది ఇంతకాలం పంజరంలో ఉండిపోయింది.. అంటూ చేతులు చూపిస్తూ ఓ ఫొటోను షేర్ చేశాడు. దానితో రౌడీ ఫాన్స్ కూల్ అవుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ సమంత అనారోగ్య కారణాలతో ఆ షూటింగ్ వాయిదా పడింది. దానితో విజయ్ నెక్స్ట్ పై మరోసారి అభిమానుల్లో ఉత్కంఠ ఏర్పడింది.