Advertisement
Google Ads BL

పెళ్లి పీటలెక్కబోతున్న యంగ్ హీరో


టాలీవుడ్ లో పెళ్లి చేసుకోకుండా ఇంకా చాలామంది హీరోలు ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకుల లిస్ట్ లో నిన్నమొన్నటివరకు రానా, నితిన్ లాంటి వాళ్ళు ఉండగా.. వారు కరోనా టైమ్ లో కామ్ గా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఇక ప్రభాస్, శర్వానంద్, రామ్, అడివి శేష్, విశ్వక్ సేన్, నాగ శౌర్య ఇలా ఇంకా పెళ్లీడు వచ్చినా పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. తాజాగా వీరిలో నాగ శౌర్య పెళ్లి పెట్టెలక్కబోతున్నాడు. పెళ్లి విషయంలో ఎలాంటి న్యూస్ బయటకి రానివ్వకుండా చాలా సైలెన్స్ ని మెయింటింగ్ చేస్తూ తన పెళ్లి మేటర్ ని పబ్లిక్ గా ప్రకటించాడు. నాగ శౌర్య ఈ నెల 20 న అనూష అనే అమ్మాయిని బెంగుళూర్ వేదికగా వివాహం చేసుకోబోతున్నట్లుగా ప్రకటించాడు. 

Advertisement
CJ Advs

నవంబర్ 20 ఉదయం 11:25 నిమిషాలకు బెంగుళూర్ లోని JW మారియట్ లో నాగ శౌర్య వివాహం అనూష తో జరగుతుంది అని, బెంగళూరులో రెండు రోజుల పాటు జరగనున్న వివాహ వేడుక లో నవంబర్ 19 న మెహందీ ఫంక్షన్‌తో ప్రీ-వెడ్డింగ్ సెలెబ్రేషన్న్ జరగబోతున్నట్టుగా తెలిపారు. ఇక నాగ శౌర్య వివాహం చేసుకోబోయే అమ్మయి అనూష ఎలాంటి బ్యాగ్ రౌండ్ నుండి వచ్చింది, అలాగే ఆమె ఫ్యామిలీ గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇక నాగ శౌర్య పెళ్ళికి పలువురు సినీ ప్రముఖులు హాజరవుతారని తెలుస్తుంది. 

Naga Shaurya To Enter The Wedlock With Anusha:

Naga Shaurya To Enter The Wedlock With Anusha In Bangalore On November 20th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs