Advertisement
Google Ads BL

అఖిల్ విషయంలో చాలా నష్టపోయాను


అక్కినేని అఖిల్ ని మాస్ యాక్షన్ మూవీ అఖిల్ తో మాస్ డైరెక్టర్ వినాయక్ తెలుగు తెరకిపరిచయం చేసాడు. కానీ అఖిల్ మూవీని ఆడియన్స్ ఆదరించలేదు సరికదా.. ఆ సినిమా కి మేకర్స్ చాలా నష్టపోయారు. వినాయక్ అయితే చాలారోజులు బయట కూడా కనిపించకుండా అజ్ఞాతంలోనే ఉండిపోయారు. అక్కినేని నాగార్జున కూడా అఖిల్ విషయంలో చాలా అసంతృప్తిని వెళ్లగక్కారు. ఒకప్పుడు స్టార్ హీరోలతో  సినిమాలు చేసిన వినాయక్ అఖిల్ తో మానసికంగానూ, అటు ఫైనాన్సియల్ గాను చాలా కుంగిపోయారు. అయితే తాజాగా వినాయక్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వినాయక్ అఖిల్ మూవీ విషయాలను పంచుకోవడమే కాదు, ఆర్ధికంగా ఎంతగా నష్టపోయారో అనేది బయటపెట్టారు.

Advertisement
CJ Advs

అఖిల్ సినిమా విషయంలో మా అంచనాలు తప్పయ్యాయి. నా వల్ల ఎవరూ నష్టపోకూడదు.. ముఖ్యంగా అఖిల్ ని కొన్న బయ్యర్లు నష్టపోకూడదు. అందుకే మధ్యలో ఓ పెద్దమనిషిని కూర్చోబెట్టి పెద్ద మొత్తంలో డబ్బు సెటిల్ చేశా. అయినా నాకేం బాధగా లేదు. కానీ అఖిల్ నాతో ఇష్టపడి, కష్టపడి, ప్రేమించి సినిమా చేసాడు. కానీ అఖిల్ కి హిట్ ఇవ్వలేకపోయాను. అదే నా బాధ. అఖిల్ ఎప్పటికైనా పెద్ద స్టార్ అవుతాడు. అయితే అఖిల్ సినిమా అనేది మాకు మొయ్యలేనంత భారంగా మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమా చేసి సక్సెస్ చేయాలనుకున్నాం. అది మా అత్యాశే. సినిమా విడుదల సమయానికి సీజీలు కాలేదు. ఆ టైమ్ లో ఓ ర‌క‌మైన మెంట‌ల్ అయిపోయాం. పూర్తిగా సినిమాను కూడా చూడ‌లేదు.. అంటూ అఖిల్ డిసాస్టర్ విషయాలను ఆ ఇంటర్వ్యూలో వినాయక్ బయటపెట్టాడు.

Director VV Vinayak comments on Akhil movie disaster:

 Vv Vinayak Says His Mistake In Akhil Debut Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs