కన్నడ నుండి బాణంలా దూసుకువచ్చిన హీరోయిన్ రష్మిక ఇప్పుడు అన్ని భాషల హీరోలకి లక్కీ గర్ల్ గా మారిపోయింది. రష్మిక అంటే లక్కీ, లక్కీ అంటే రష్మిక అన్న రేంజ్ లో ఆఫర్స్ పట్టేస్తుంది. తెలుగులో గుర్తింపు పొందిన తర్వాత బాలీవుడ్ కి వెళ్లిన రష్మిక.. అక్కడ హిందీ సినిమాలతో బాగా బిజీగా మారిపోయింది. మధ్యలో విజయ్ దేవరకొండ తో స్నేహం విషయంలో బాగా పాపులర్ అయ్యింది. అయితే తాజాగా రష్మిక ఓ విషయంలో చాలా ఎమోషనల్ గా స్పందించింది. రష్మిక ఇన్స్టాలో ఓ పెద్ద లెటర్ ని పోస్ట్ చేసింది. గడిపోయిన కొద్దిరోజులు, వారాలు, నెలలు లేదా సంవత్సరాలుగా కొన్ని విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి.
వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. అసలైతే ఈ పని ఎప్పుడో చెయ్యాల్సి ఉంది. కానీ కొంచెం లేటయ్యింది. నేను హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టినప్పటినుండి కొందరు నన్ను ద్వేషిస్తున్నారు. అనవసరంగా దారుణంగా ట్రోలింగ్ చేశారు. వారి చేసిన పని ఇప్పటికీ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. కానీ అందరూ నటిగా మనల్ని ప్రేమించాలని లేదు, ఆదరించాలని అసలే లేదు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి తప్పులేదు. కానీ అదే పనిగా విమర్శిస్తూ ట్రోల్ చెయ్యాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ అందరిని సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను. మీరు గర్వించేలా నటించాలనే అడుగులు వేస్తున్నా.. కానీ ఇలాంటి ట్రోల్స్ వలన అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధిస్తాను అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసిన రశ్మికకి ఆమె అభిమానులు సపోర్ట్ గా నిలుస్తున్నారు.