బిగ్ బాస్ నుండి అనూహ్యంగా ఎలిమినేట్ అవుతానని ఊహించని గీతు తొమ్మిదో వారం ఎలిమినేట్ అవడంతో బిగ్ షాక్ తో స్టేజ్ పై వెక్కి వెక్కి ఏడుస్తూ నాగార్జున ఓదార్చినా నిలబడలేక.. ఆఖరికి బిగ్ బాస్ ఎంప్లోయిస్ వచ్చి ఆమెని బయటికి పంపాల్సి వచ్చింది. బయటికి వచ్చాక కూడా BB కేఫ్ ఇంటర్వ్యూ తర్వాత కనిపించకుండా పోయిన గీతు ఈ సీజన్ పూర్తయ్యేవరకు బయటికి రాను అని చెప్పినట్టుగానే సైలెంట్ గా సీక్రెట్ గా ఇంట్లోనే ఉండిపోయింది అని కొంతమంది అంటుంటే.. కొంతమంది మాత్రం ఆమెని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మళ్ళీ హౌస్ లోకి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.
అందుకే గీతు ని ఎలాంటి ఇంటర్వూస్ లో ఎక్స్ పోజ్ అవ్వకుండా బిగ్ బాస్ యాజమాన్యం చూస్తుంది అని, ఈ వారాంతంలో గీతూ ని రీ ఎంట్రీ ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని, సీక్రెట్ రూమ్ అంటూ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఈసారి గీతూ ని హౌస్ లోకి పంపించబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరి నిజంగా గీతూ లాంటి కంటెస్టెంట్ ని మిస్ చేసుకున్న బిగ్ బాస్ యజమాన్యం ఆమె గురించి ఇలాంటి ఆలోచన చేస్తే ఓకె.. లేదు ఆమె చెప్పినట్టుగా గ్రాండ్ ఫినాలే వరకు బయటికి కనిపించకుండా ఉండిపోతుందో చూడాలి. కానీ గీతూ ఛానల్స్ లో ఇంటర్వూస్ ఇవ్వకపోయేసరికి చాలామంది బోర్ ఫీలవుతున్నారు.