Advertisement
Google Ads BL

‘యాత్ర 2’.. వైఎస్ జగన్‌గా ఎవరంటే?


ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి.. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా.. రీసెంట్‌గా వర్మ మీట్‌తో అందరికీ అర్థమైంది. జగన్‌ని కలిసి వచ్చిన తర్వాత వర్మ చేసిన రచ్చ ఏంటో తెలియంది కాదు. ‘వ్యూహం’, ‘శపథం’ అంటూ ఏపీ రాజకీయాలపై రెండు సినిమాలను తీయబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు. ఈ సినిమాలకు వైసీపీకి చెందిన వారు నిర్మాతలుగా వ్యవహరిస్తారని కూడా వెల్లడించాడు. దీంతో ఒక సైడ్ నుంచి జగన్ బాణాలను సిద్ధం చేస్తున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. మరోవైపు రాజకీయంగా ప్రతిపక్ష నేతల్ని ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడో, ఎలా వారిని మానసికంగా హింసిస్తున్నాడనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి.. అటు పొలిటికల్‌గానూ, ఇటు సినిమాల పరంగానూ జగన్ యమా స్పీడ్ మీద ఉన్నాడనేదానికి ఉదాహరణగా.. ఇప్పుడు ఇంకో వార్త బయటికి వచ్చింది. కరెక్ట్‌గా ఎన్నికలకు ముందు వర్మతో రెండు సినిమాలు ప్లాన్ చేస్తే.. మరో దర్శకుడితో ఇంకో సినిమాని కూడా లైన్‌లోకి తెచ్చేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. 

Advertisement
CJ Advs

 

ఆ సినిమా ఏదో కాదు.. ‘యాత్ర’ సీక్వెల్ ‘యాత్ర 2’. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమా మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందిన విషయం తెలిసిందే. మెగాస్టార్ మమ్ముట్టి అందులో రాజశేఖర్ రెడ్డిగా నటించారు. ఇప్పుడా సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ను తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత నుండి.. వైఎస్ జగన్ అధికారం చేపట్టే వరకు.. వైసీపీకి అనుకూలంగా.. జగన్ పాదయాత్ర వంటి సన్నివేశాలతో తెరకెక్కించబోతున్నారనేలా టాక్ నడుస్తుంది. ఈ పార్ట్‌లో వైఎస్ జగన్‌గా మమ్ముట్టి తనయుడు, ఇటీవల వచ్చిన ‘సీతా రామం’ చిత్రంతో ప్రేక్షకులను మనసులను గెలుచుకున్న దుల్కర్ సల్మాన్ నటించబోతున్నట్లుగా తాజా సమాచారం. ఈ పాత్రను చేసేందుకు దుల్కర్‌కు ఊహించని రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లుగా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే ‘యాత్ర 2’కు సంబంధించి అప్‌డేట్ రాబోతోందని తెలుస్తోంది.

YS Jagan Plans Yatra Movie Sequel:

Dulquer Salmaan will play the Ys Jagan Role in Yatra 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs