Advertisement
Google Ads BL

ప్రతి ఫంక్షన్‌లో ఇలాంటోడు ఒకడుంటాడు


స్టార్ హీరోలు అని కాదు, చిన్న హీరోలు అని కాదు.. ఏదైనా పబ్లిక్ ఫంక్షన్ జరుగుతుంటే.. అందులో మెయిన్ వ్యక్తి ఎవరైనా స్పీచ్ ఇస్తుంటే చాలు.. జనంలోంచి ఒకడు పరుగెత్తుకుంటూ స్టేజ్‌పైకి వచ్చి.. ఆ మాట్లాడుతున్న వారి కాళ్లపై పడిపోవడం రెగ్యులర్‌గా జరుగుతూ వస్తుంది. మొదట్లో అభిమానం చూపిస్తున్నారని, ఆ తర్వాత పీఆర్‌లు కావాలని చేయిస్తున్నారనేలా ఈ ఘటనపై టాక్ నడుస్తూ వస్తుంది. అయితే ఎంత పీఆర్‌లు సెట్ చేసినా.. పదే పదే అలాగే జరుగుతుంటే చూసేవారికి కూడా బోర్ కొడుతుంది కదా. కొత్తగా ఏదైనా ట్రై చేయకుండా.. ఇలా ప్రతి ఫంక్షన్‌లో చేసినా, చేయించినా పరమ రొటీన్ యాక్ట్‌గా మారిపోతుంది తప్ప.. ఉపయోగం లేదు. తాజాగా జరిగిన ‘ఊర్వశివో రాక్షసివో’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కూడా ఇది రిపీటైంది.

Advertisement
CJ Advs

 

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతుండగా.. ఒకడు పరుగెత్తుకుంటూ వచ్చి కాళ్లపై పడితే.. అతడితో ఒక ఫొటో దిగి.. బన్నీ పంపించేశాడు. ఆ తర్వాత అతనిపై బన్నీ ఓ పంచ్ కూడా పేల్చాడు. ఇలాంటి వేస్ట్ గాళ్లు ప్రతి ఫంక్షన్‌లో ఒకడు ఉంటాడనే అర్థం వచ్చేలా.. ‘ప్రతి ఫంక్షన్‌లో ఇలాంటోడు ఒకడుంటాడు’ అంటూ సెటైర్ వేశాడు. ఈ సెటైర్‌పై సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చలు నడుస్తున్నా.. బన్నీ చెప్పింది మాత్రం నిజమే. ఈ రొటీన్ యాక్ట్‌తో జనాలు కూడా విసిగిపోయారు. ఎందుకంటే ఎయిర్‌ పోర్ట్‌లో కోడి కత్తి డ్రామాలు చూసిన జనాలకి.. ఈ డ్రామాలేం సరిపోతాయ్. అందుకే కొత్తగా ఏదైనా థింక్ చేయండమ్మా.. అంటూ కొందరు ఈ ఇన్సిడెంట్ తర్వాత సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

Allu Arjun Satirical Comment on His Fan :

Comments on Bunny act at Urvasivo Rakshasivo Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs