ప్రముఖ టెన్నిస్ ప్లేయర్, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల ప్రేమ అప్పట్లో పెను సంచలనం. ఇరువురూ ఎల్లలు దాటి తమ ప్రేమని పెళ్లి పేరుతొ ఒక్కటి చేసారు. ఇండియా vs పాకిస్తాన్ అన్న రేంజ్ లో గొడవలు పడే ఈ రెండు దేశాలకి వీరి పెళ్లి షాకిచ్చింది. అటు సానియా పాకిస్తాన్ కోడలు అవ్వగా, ఇటు షోయబ్ ఇండియాకి అల్లుడయ్యాడు. వీరిద్దరూ ఎక్కువగా దుబాయ్ లోనే ఉంటున్నారు. అయితే వారి 12 ఏళ్ళ వైవాహిక బంధానికి ముగింపు పలకబోతున్నారనే న్యూస్ వారి ఫాన్స్ కి షాకిచ్చింది. సానియా మీర్జా - షోయబ్ తరుచు గొడవలు పడుతూ కలతలు రావడంతోనే ఈ నిర్ణయానికి వచ్చారనే న్యూస్ వినిపిస్తుంది.
ఇక సానియా మీర్జా కూడా తన కొడుకుతో ఉన్న పిక్ ని ఇన్స్టా లో పోస్ట్ చేస్తూ.. ముక్కలయిన హృదయం ఎక్కడికి వెళుతుంది.. అల్లాని అన్వేషిస్తుంది అంటూ చేసిన ట్వీట్ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే సానియా మీర్జా మాత్రం షోయబ్ తో తరుచూ గొడవ పడి కలిసి బ్రతకడం కన్నా విడిపోయి స్నేహితులుగా ఉండడం కరెక్ట్ అని చెప్పినట్లుగా తెలుస్తుంది. కొడుకు ఇంజమామ్ కోసమే ప్రస్తుతం వీరు అప్పుడప్పుడు కలుస్తున్నారంటూ గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి.