బిగ్ బాస్ సీజన్ 6 తొమ్మిదివారాలు తొమ్మిదిమందిని ఎలిమినేట్ చేసి పదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం కూడా ఏకంగా తొమ్మిదిమంది నామినేషన్స్ లోకి వెళ్లగా. పదో వారం కెప్టెన్సీ టాస్క్ మొదలయ్యింది. అయితే ఈవారం రికార్డ్ స్థాయిలో ఇనాయని టార్గెట్ చేసింది హౌస్. నోరుతో పాటుగా ఆట తీరులోనూ స్పెషల్ గా మారిన ఇనాయ ఇప్పుడు టాక్ అఫ్ ద బిగ్ బాస్ అయ్యింది. నిన్నటివరకు గీతూ రాయల్ ఎలాగయినా కప్ గెలవాలని నోటికి పని చెప్పేది. కానీ ఇనాయ ఇప్పుడు కాదు మొదటి నుండి తన నోటితో అందరిని శత్రువులుగా మార్చుకుని, ఆట లోను శత్రువులు పెంచుకుంది. అలా ఇప్పుడు ఆమె టాప్ 2 కి వెళ్లగలిగే సత్తాని సంపాదించింది. నిన్నటి వరకు టాప్ 2 లో సింగర్ రేవంత్ అలాగే గీతూ కానీ శ్రీహన్ కానీ ఉంటారనే అభిప్రాయంలో ఉన్న ఆడియన్స్ ఇపుడు గీతూ ని ఇంటికి పంపేసి, శ్రీహన్ ని పక్కనబెట్టి సెకండ్ ప్లేస్ ని ఇనాయకి కట్టబెడుతున్నారు.
రేవంత్ టైటిల్ ఫెవరెట్ గా అగ్రెసివ్ గా ఆకట్టుకుంటుంటే.. ఇనాయ ఆటతోను, అగ్రెసివ్ తోనూ అదరగొట్టేస్తుంది. టాప్ 2 లో ఉంటున్న శ్రీహన్ కి గట్టి పోటీఇస్తుంది. గీతూ, శ్రీహన్ టాప్ 2 కోసం పోటీ పడినా.. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఇనాయ ఉండాల్సిందే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు మొదలయ్యాయి. ఆమెని హౌస్ ఎక్కువగా టార్గెట్ చేసింది అంటే.. ఆమెకున్న క్వాలిటీస్, ప్రత్యేకత అర్ధమవుతుంది అంటున్నారు. సో బిగ్ బాస్ సీజన్ 6 టాప్ 5 కాదు టాప్ 2 లో రేవంత్-ఇనాయ పక్కా అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో అనేది.