Advertisement
Google Ads BL

మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా బన్నీ?


మన గురించో, మన ఫ్యామిలీ గురించో గొప్పగా మాట్లాడుతుంటే కళ్లు చెమ్మగిల్లడం సాధారణమైన విషయమే. దీనికి సెలబ్రిటీలేం అతీతం కాదని తెలియజేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అందుకు ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుక వేదికైంది. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేశ్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా.. సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. దీంతో తమ సంతోషం తెలియజేసేందుకు మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇక ఈ కార్యక్రమంలో తన గురించి తన తమ్ముడు అల్లు శిరీష్ మాట్లాడుతున్నప్పుడు.. అలాగే తన స్నేహితుడు బన్నీ వాసు మాట్లాడుతున్నప్పుడు.. అల్లు అర్జున్ కళ్లలో నీళ్లు వచ్చేస్తూనే ఉన్నాయి. 

Advertisement
CJ Advs

 

వారి మాటలకు బన్నీ బాగా ఎమోషన్ అయ్యాడు. అందుకే టిష్యూతో తన కళ్లు తుడుచుకుంటూనే ఉన్నాడు. ముఖ్యంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.. నేను మా అన్నయ్యకు బిడ్డ లాంటి వాడిని అని అన్నప్పుడు, అలాగే బన్నీ వాసు మాట్లాడుతూ.. తనకు సర్వస్వం బన్నీనే అని అన్నప్పుడు.. అల్లు అర్జున్ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఎంత దాచిపెడతామన్నా.. ఆ ఎమోషన్ కంట్రోల్ కాలేదు. అందుకే కళ్లలో నీళ్లు వచ్చేశాయి. పక్కన అల్లు అరవింద్ ఉన్నా కూడా.. అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనైన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్, ఇతరులందరూ.. ‘మరీ.. ఇంత సెన్సిటివ్ అయితే ఎలా బన్నీ?’ అని అనుకుంటుండటం విశేషం. ఎమోషన్‌కి ఎవరైనా ఒకటే.. అనేదానికి ఇదొక ఎగ్జాంపుల్‌గా అంతా భావిస్తున్నారు.

Allu Arjun Is A Highly Sensitive Person:

Allu Arjun Emotionaled at Urvashivo Rakshasivo event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs