లైగర్ దెబ్బకి విజయ్ దేవరకొండ ఏమైపోతాడో అని ఫాన్స్ చాలా దిగులు పడిపోయారు. మరి లైగర్ దెబ్బ అలాంటి ఇలాంటి దెబ్బ కాదు, పాన్ ఇండియా దెబ్బ పడిపోయింది. దానితో విజయ్ డల్ అవుతాడనుకున్నారు. కానీ బౌన్స్ బ్యాక్ లాగ విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ఫంక్షన్స్ కి పార్టీలకి అటెండ్ అయ్యాడు. తదుపరి మూవీ షూటింగ్ కోసం రెడీ అయ్యిపోయాడు. కానీ టైమ్ బాగాలేక విజయ్ దేవరకొండ తదుపరి మూవీ షూటింగ్ వాయిదా పడింది. అయినప్పటికీ రోజుకో ఫోటో షూట్ తో సోషల్ మీడియా లో ఫాన్స్ కి అందుబాటులో ఉంటున్నాడు.
తాజాగా ఆదివారం నగరంలో జరిగిన ఓ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. ఆ ఈవెంట్ కి భారీగా చేరుకున్న ఫాన్స్ అన్నా మంచి కమ్ బ్యాక్ తో రావాలంటూ నినాదాలు చెయ్యడంతో విజయ్ దేవరకొండ కూడా హుషారుగా స్పందించారు. అభిమానులు నన్ను కమ్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, మీకు ఒక్కటే చెబుతున్నా, మళ్ళీ తిరిగొస్తా అంటూ విజయ్ దేవరకొండ ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.