బిగ్ బాస్ ని రూల్ చేస్తాను, నేనే బిగ్ బాస్, టాస్క్ ఆడిపిస్తాను, అందరూ నేను చెప్పిందే వినాలి, ఈ వారం వాళ్ళు పోతారు, వీళ్ళు పోతారంటూ రివ్యూస్ ఇస్తూ హౌస్ లో బిల్డప్ ఇచ్చిన గీతూ రాయల్ నిజంగానే ఆమె ఎంటర్టైనర్ గా మంచి మార్కులు వేయించుకుంది. టాస్క్ పరంగా తెలివితో గేమ్ ఆడే గీతూ రాయల్.. కనీసం టాప్ 5 కాదు టాప్ 10 లో కూడా ఉండకుండానే హౌస్ నుండి ఎలిమినేట్ అవడం ఆమెని బాధించింది. నేను పోను, నన్ను పంపించకండి బిగ్ బాస్ అంటూ ఏడ్చిన గీతూ బిగ్ బాస్ విన్నర్ అవుదామని కలలు కన్నట్టుగా BB కేఫ్ ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ టాప్ 10 లో కూడా లేకుండా పోయాను అంటూ ఏడ్చేసింది. అయితే ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైనే చెప్పింది.. బిగ్ బాస్ అయ్యేవరకు ఎవరికీ కనబడను అని, తర్వాతే బయటికి వస్తా అంటూ నాగార్జున తో చెప్పింది.
అన్నట్టుగానే ఎలిమినేట్ అయ్యి BB కేఫ్ ఇంటర్వ్యూ తర్వాత గీతూ రాయల్ బయటికి వచ్చి సైలెంట్ గా కార్ ఎక్కేసి వెళ్ళిపోయింది. ఏ ఛానల్ లోను కనబడలేదు. కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. నిన్న ఆదివారం ఇన్స్టా లైవ్ లోకి వచ్చింది అంతే.. తర్వాత ఏ ఛానల్ లో, ఏ యూట్యూబ్ ఛానల్ లో గీతూ ఇంటర్వ్యూ లేదు. కానీ గీతూ అన్నట్టుగానే ఎలిమినేట్ అయ్యాక మీడియా కి ముఖం చూపించకుండా ఆమె అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బిగ్ బాస్ పూర్తయ్యి విన్నర్ ని ప్రకటించాకే బయటికి వస్తుందేమో చూడాలి. కానీ ఆమె ఇప్పటికి తన ఎలిమినేషన్ ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది అనేది వాస్తవం.