మహేష్ బాబు చాలా కాలం వేచి చూసాకే త్రివిక్రమ్ తో సినిమా మొదలు పెట్టాడు. దాదాపు వీరి కలయిక మళ్ళీ మొదలవడానికి ఏకంగా 12 ఏళ్ళు పట్టింది. అయినప్పటికీ.. వీరి కాంబో అనౌన్సమెంట్ వచ్చాక చాలా టైం తీసుకుని SSMB28 ని సెట్స్ మీదకి తీసుకువెళ్లారు. అయితే మొదటి షెడ్యూల్ ని త్రివిక్రమ్-మహేష్ త్వరగా పూర్తి చేసెయ్యడంపై పలు రకాల అనుమానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంటే మహేష్ బాబు తన లుక్ పై అంతగా ఇంప్రెస్స్ అవ్వలేదు అలాగే స్క్రిప్ట్ విషయంలో మహేష్ సంతృప్తిగా లేదనే వార్తలు వినిపించాయి.
మధ్యలో మహేష్ బాబు పర్సనల్ లాస్ అలాగే ఫ్యామిలీ వెకేషన్స్ తో రిలాక్స్ అయిన మహేష్ SSMB28 షెడ్యూల్ కి ఇంకా రెడీ అవ్వలేదు, త్రివిక్రమ్ పూర్తి స్క్రిప్ట్ తో తనని ఇంప్రెస్స్ చేసేవరకు సెకండ్ షెడ్యూల్ మొదలు కాదు అనుకున్నారు. ఇక మహేష్ రీసెంట్ గా లండన్ నుండి హైదరాబాద్ కి రావడమే SSMB28 నిర్మాత నాగ వంశీ.. SSMB28 సెకండ్ షెడ్యూల్ సూన్.. ఇకపై ఎగ్జైటింగ్ అప్ డేట్స్ తో వచ్చేస్తాం అంటూ అప్ డేట్ ఇవ్వడంతో మహేష్ ఫాన్స్ కూల్ అయ్యారు. తాజాగా త్రివిక్రమ్ కూడా మహేష్ ని పూర్తి స్రిప్ట్ తో ఇంప్రెస్స్ చెయ్యడమూ జరిగింది అని, అన్ని అడ్డంకులు తీరిపోయి ఈ నెల మూడో వారం నుండి హైదరాబాద్ లోనే SSMB28 సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది అని తెలుస్తుంది.