బిగ్ బాస్ సీజన్ 6 తొమ్మిదివారాలు పూర్తి చేసుకుని 10వ వారంలోకి అడుగుపెట్టింది. తొమ్మిదివారంలో తొమ్మిదిమంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడారు. ఇందులో స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ బయటికి వెళ్లడం చాలామందికి అర్ధం కాని విషయంగా మిగిలిపోయింది. టాప్ 5 అనుకున్న సూర్య, గీతూ ఎలిమినేషన్ మాత్రం ప్రేక్షకులకి, హౌస్ మేట్స్ కి బిగ్ షాక్. ఇంకా ఆ షాక్ లో ఉండగానే పదో వారం నామినేషన్స్ హీట్ మొదలవడమే కాదు, అప్పుడే ముగిసిపోయింది. పదో వారం కేవలం ముగ్గురు తప్ప హౌస్ మొత్తం నామినేట్ అయినట్లుగా తెలుస్తుంది.
ముఖ్యంగా ఆది రెడ్డికి రేవంత్ కి మధ్యన నామినేషన్స్ కారణంగా పెద్ద గొడవే జరిగిన విషయాన్ని ప్రోమోలోనే చూపించారు. అలాగే ఇనాయకి ఆది రెడ్డికి రచ్చ అయ్యింది. ఈ వారం హౌస్ మేట్స్ ని నీళ్లతో కొట్టి నామినేట్ చెయ్యాలి. గత వారం లాగే ఇనాయని చాలామంది టార్గెట్ చేసారు. ముఖ్యంగా రేవంత్-ఆది రెడ్డి-శ్రీహన్ లు ఇనాయతో నామినేషన్స్ విషయంలో గొడవపడ్డారు. ఇనాయ కూడా ఎక్కడా తగ్గలేదు.. తనని నామినేట్ చేసిన వారిపై సివంగిలా టార్గెట్ చేసి గొడవపడింది. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ గత రాత్రే ముగిసినట్టుగా తెలుస్తుంది. అంటే ఈరోజు రాబోయే ఎపిసోడ్ లో చూడాల్సిన నామినేషన్స్ లిస్ట్.. లీకుల ద్వారా బయటికి వచ్చేసింది. ఈ వారం ఏకంగా తొమ్మిదిమంది నామినేషన్స్ లోకి వెళ్ళినట్టుగా టాక్. ఇనాయా, శ్రీహాన్, బాలాదిత్య, రేవంత్, కీర్తి, మెరీనా, వాసంతి, ఆది రెడ్డి, ఫైమాలు నామినేట్ అవ్వగా.. ఈ వారం రోహిత్, రాజ్ సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక శ్రీ సత్యాని కెప్టెన్ అయిన కారణంగా ఎవరూ నామినేట్ చెయ్యలేదు.