కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రెస్స్ గా మారుతున్న హీరో విశ్వక్ సేన్ తాజాగా మరో తప్పు చేసాడనే భావనలో చాలామందే ఉన్నారు. అది విశ్వక్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నుండి బయటికి రావడం. కొన్ని కారణాల వలన సినిమా షూటింగ్ మొదలయ్యాక విశ్వక్ ఆ మూవీ నుండి తప్పుకున్నాడనే వార్త చూడగానే అర్జున్ హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ సేన్ ఇలాంటి వాడు, కమిట్మెంట్ లేని వాడు, అతనికి నిబద్దత లేదు అంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ కూడా సెట్స్ లో గౌరవం లేనపుడు పనేలా చేస్తాము అంటూ తేల్చేసాడు. తాజాగా విశ్వక్ సేన్ ఓ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్ళాడు.
ఆ ఈవెంట్ లో విశ్వక్ సేన్ అర్జున్ తో గొడవ విషయం పై వివరణ ఇచ్చాడు. నేను కథలో మార్పులు చెయ్యమని అడిగాను, కాని అర్జున్ గారు చెయ్యలేదు. నేను షూటింగ్ మొదలు పెట్టే రోజు ఆపెయ్యమని చెప్పడం తప్పే అంటూ తాను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. నేను వేరే ఎవరితో సినిమా చేసినా.. అది నా సినిమానే అని ప్రమోషన్స్ చేసి భుజాన వేసుకుని తిరుగుతాను. సినిమా అంటే అంత పిచ్చి నాకు. నా అంత కామిటెడ్, ప్రొఫెషనల్ ఎవరూ ఉండరు. నా వల్ల ఇండస్ట్రీలో ఏ నిర్మాతా ఇబ్బంది పడలేదు, డబ్బు పోగొట్టుకోలేదు. చేసింది చిన్న సినిమాలే.. కానీ పని చేసింది పెద్ద నిర్మాతలతో. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడలేదు. నేను పని చేసిన దర్శకనిర్మాతలు నేను ప్రొఫెషనల్ కాదంటే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
అర్జున్ గారి కథ నచ్చబట్టే సినిమా చేద్దామని ఒప్పుకున్నా.. అన్ని సినిమాల వలే పని చేద్దామనుకున్నాను, చేసిన జర్నీ బాగానే ఉంది. సినిమా షూటింగ్ కి ఓ వారం ముందే అక్కడ ఇలా చేద్దాం, ఇక్కడ అలా చేద్దామని చెప్పా ఆయన వినలేదు.. షూటింగ్ మొదటి రోజు ఎందుకో మనసుకు నచ్ఛలేదు, షూటింగ్ క్యాన్సిల్ చెయ్యమన్నాను అది తప్పే.. కానీ మనసుకు నచ్చకుండా చెయ్యలేం కదా అంటూ విశ్వక్ అర్జున్ ఇష్యుపై వివరణ ఇచ్చే ప్రయత్నమైతే గట్టిగానే చేసాడు.