బిగ్ బాస్ సీజన్ 6 నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా బయటికి వెళుతున్నారు. నేహా, చంటి, సూర్య, ఈ వారం గీతూ రాయల్ ఇలా. టాప్ 5 అనుకున్న సూర్య-గీతూ ఎలిమినేషన్స్ అందరికి కాదు హౌస్ మేట్స్ కి బిగ్ షాక్. సూర్య ఎలిమినేట్ అవ్వడగానే ఇనాయ ఘొల్లుమంది, ఈ రోజు గీతూ ఎలిమినేట్ అవ్వగానే శ్రీహన్, ఫైమా అందరూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. గీతూ తప్పు చేసినప్పుడు పనిష్ చెయ్యకుండా వారాంతంలో నాగర్జున చేత తిట్లు తిట్టించి ఆమెని ఇలా బిగ్ బాస్ సడన్ గా ఎలిమినేట్ చేయడంపై ప్రేక్షకులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. టాప్ 5, టాప్ 5 అంటూ ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. కానీ గీతూ ని ఇలా ఎలిమినేషన్ తో బయటికి పంపెయ్యడం జీర్ణించుకోలేకపోతున్నారు.
అదలా ఉంటేఈరోజు ఎపిసోడ్ కి సంబందించిన రెండు ప్రోమోస్ వదిలారు. అందులో సన్ డే ఫన్ డే టాస్క్ లు ఆడిస్తూనే స్నేక్ అండ్ లెడెర్ గేమ్ ఆడించాడు నాగ్. అందులో తమకి ఇష్టం లేని వారిని పాములుగా ఎంచుకున్నారు మిగతా కుటుంబ సభ్యులు. రేవంత్ వాసంతి కళ్ళు పాములా ఉంటాయనగానే మీ ఆవిడ కళ్ళు గుర్తుపట్టవు కానీ.. వాసంతి కళ్ళు గుర్తు పట్టావా రేవంత్ అంటూ నాగ్ ఆట పట్టించగానే వాసంతి ఐపాయ్ అంటూ సరదాగా కామెంట్ చేసింది. ఇక నాగార్జున ఇనాయ నీకేం కావాలో, నీ మనసు ఎవరిని కోరుకుంటుందో నాకు తెలుసు అంటూ సీక్రెట్ రూమ్ కి వెళ్ళమని చెప్పగానే ఇనాయ పరుగో పరుగు. అక్కడికి సూర్య వచ్చాడేమో అన్నంతగా పరిగెత్తింది.
అయితే కొంతమంది ప్రేక్షకులు కూడా.. ఎమన్నా బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ అంటూ ట్విస్ట్ ఇస్తారేమో చూడాలి అంటూ అనుమాన పడుతున్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో శ్రీ సత్య-గీతూ ని డేంజర్ జోన్ లో నిలబెట్టి ఫైనల్ గా గీతుని ఎలిమినేట్ చేసారు.