ఈమధ్యన త్రిష పేరు తెలుగు, తమిళంలో బాగా వినిపిస్తుంది. కెరీర్ లో సీనియర్స్ లిస్ట్ లోకి వెళ్ళిన ఈ తార పొన్నియన్ సెల్వన్ తో మరోసారి లైమ్ టైమ్ లోకి వచ్చింది. పొన్నియన్ సెల్వన్ లో త్రిష లుక్, ఆమె ప్రమోషన్స్ లో సింపుల్ అండ్ సారీ లుక్స్ ఆమెకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే తెలుగులో బాలకృష్ణ తో అనిల్ రావిపూడి చెయ్యబోయే మూవీ కోసం త్రిషని సంప్రదిస్తున్నారనే న్యూస్ ఉంది. ఇక పొన్నియన్ సెల్వన్ ప్రమోషన్స్ బర్డెన్, మరికొన్ని బిజీ షెడ్యూల్స్ తో తీరిక లేని త్రిషకి కాస్త ఫ్రీ టైమ్ దొరికింది.
అంతే వెంటనే వెకేషన్స్ లో వాలిపోయింది. అక్కడ వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే త్రిష కాలు విరగ్గొట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఆమె టూర్ లో ఉండగా అనుకోని ప్రమాదం జరిగి కాలు కి ఫ్యాక్చర్ అయినట్లుగా తెలుస్తుంది. ఆమె కాలు కి బ్యాండేజ్ ఉన్న ఫోటో ని షేర్ చేస్తూ కాలుకి తగిలిన దెబ్బ వలన వెకేషన్స్ నుండి మధ్యలోనే తిరిగి రావాల్సి వచ్చింది అంటూ చెప్పడంతో ఆమె అభిమానులు త్రిష కాలు చూసి అయ్యో త్రిషా.. జాగ్రత్త, త్వరగా కోలుకో అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.