NTR30 అప్ డేట్ కావాలంటూ ఎన్టీఆర్ ఫాన్స్ గొంతు చించుకుంటున్నారు. కానీ మేకర్స్ కామ్ గా వేడుక చూస్తూ కూర్చున్నారు. ఎన్టీఆర్ అయితే NTR30 విషయాలేమి మాట్లాడం లేదు. మధ్యలో కళ్యాణ్ రామ్ బింబిసార ప్రమోషన్స్ లో భారీ బడ్జెట్, అలాగే ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు తగ్గట్టుగా రెడీ చేస్తున్నారు అని చెప్పడంతో ఫాన్స్ కూల్ అయ్యారు. మళ్ళీ గ్యాప్ వచ్చెయ్యడం,తో ఎన్టీఆర్ ఫాన్స్ ఆందోళన స్టార్ట్ చేసారు. ఇక మొన్నీ మధ్యన NTR30 నుండి చాలా చిన్న అప్ డేట్ వచ్చింది. అనిరుధ్ రవిచంద్రన్ ఈ నెలాఖరు నుండి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చోబోతున్నాడనే న్యూస్ కే ఫాన్స్ పండగ చేసుకున్నారు.
ఇక నేడు NTR30 వన్ అఫ్ ద నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ నుండి ఫస్ట్ అప్ డేట్ వచ్చింది. కొరటాల శివ తన టీమ్ తో NTR30 ప్రీ ప్రొడక్షన్ లో కూర్చున్న పిక్స్ ని షేర్ చేస్తూ NTR30 ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ అంటూ అప్ డేట్ ఇవ్వడంతో ఫాన్స్ రెచ్చిపోయి పండగ చేసుకోవడమే కాదు.. NTR30 ని, కొరటాల శివ ని ట్రెండ్ చేస్తూ రచ్చ స్టార్ట్ చేసేసారు. ఈ నెల చివరి వారంలో NTR30 రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.