Advertisement
Google Ads BL

అర్జున్ vs విశ్వక్ సేన్: కాంట్రవర్సీ ఇంటర్వ్యూ


ఈ రోజు ఉన్నట్టుండి విశ్వక్ సేన్ పై కొన్ని వార్తలు వెబ్ మీడియాలో హైలెట్ అయ్యాయి. అవి విశ్వక్ సేన్ యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ నుండి వాకౌట్ చేసాడు అని. అయితే ఆ వార్తలపై దర్శకుడు అర్జున్ స్పందిస్తూ..

Advertisement
CJ Advs

కొన్ని సైట్స్ లో మా సినిమా నుంచి వీశ్వక్ సేన్ బయటకు వచ్చాడు అని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఎందుకు వచ్చాయో తెలీదు. నా కూతుర్ని తెలుగు ద్వారా హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాను. నా స్టొరీ విశ్వక్ సేన్ కి కూడా బాగా నచ్చింది అని చెప్పాడు. తరువాత రెమ్యునరేషన్ విషయంలో కూడా అతను చెప్పిన విధంగా అగ్రిమెంట్ జరిగింది.

కానీ నా లైఫ్ లో విశ్వక్ సేన్ చేసినన్ని కాల్స్ ఎవ్వరికీ చెయ్యలేదు. కేరళ లో షూట్ మొదలు పెట్టినప్పుడు అతని మేనేజర్ వచ్చి టైం కావాలి అన్నాడు. ఆ షెడ్యుల్ లో జగపతి బాబు గారు కూడా వున్నారు ఆయన డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి. సీనియర్ హిరో లు ఎంతో కమిట్ మెంట్ తో వుంటారు. 

టాప్ స్టార్స్ అయిన అల్లు అర్జున్, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు ఎంతో డెడికేటెడ్ గా వుంటారు. వాళ్లకు  ఏమి తక్కువ. మన వర్క్ కి మనం సిన్సియర్ గా వుండాలి అని చెపుతున్నాను. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎంతో పెద్ద స్థాయి లో వుంది. నేను ఇలాంటి వాతావరణంలో నేను సినిమా చెయ్యడం లేదు అని చెపుతున్నాను. ఈ విషయం అందరికీ తెలియాలి అని ప్రెస్ మీట్ పెట్టాను అంటూ ఎమోషనల్ అయ్యారు అర్జున్.

 

Arjun vs Vishwak Sen: controversial press meet:

Action Arjun controversial press meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs