యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ షూటింగ్ పూర్తి చేసేసి ఏడాది గడిచిపోయింది. గత సెప్టెంబర్ లోనే ట్రిపుల్ ఆర్ షూటింగ్ ఫినిష్ చేసి టీమ్ ప్రమోషన్స్ లోకి దిగింది. కానీ కరోనా తో ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యి ఈ ఏడాది మార్చి లో విడుదలైంది. దాదాపు ఏడాది కాలంగా షూటింగ్ చెయ్యని ఎన్టీఆర్ కొత్త సినిమా విషయంలో ఫాన్స్ ఇంట్రెస్టింగ్ కాదు ఆందోళనలో ఉన్నారు. ఏడాదిగా ఖాళీగా ఉంటున్న ఎన్టీఆర్ విషయంలో వాళ్ళు మదనపడిపోతున్నారు. అయితే ఇన్నాళ్ళకి ఎన్టీఆర్ మళ్ళీ షూటింగ్ స్పాట్ లో అన్న న్యూస్ చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే యంగ్ టైగర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన NTR30 షూటింగ్ లో మాత్రం పాల్గొనడం లేదు.
మిగతా హీరోలు సినిమాల కన్నా పలు ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్లు గా మారిపోయి తెగ యాడ్ షూట్స్ చేస్తున్నారు. మహేష్-అల్లు అర్జున్ అయితే అదే పని మీద ఉండగా.. రామ్ చరణ్ కూడా ఒకటి రెండు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ బిజీగా ఉంటే.. ఎన్టీఆర్ అటు సినిమాలు లేవు, ఇటు యాడ్స్ లేవన్నట్టుగా ఫ్రీ గా ఇంటి దగ్గర ఉంటున్నాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఓ నేషనల్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నాడట. ఆ ప్రోడక్ట్ యాడ్ షూట్ ఈ రోజు మొదలు పెట్టినట్లుగా, ఎన్టీఆర్ ఆ షూట్ లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఎన్టీఆర్ ఏ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నాడో అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడని తెలిసి ఎన్టీఆర్ ఫాన్స్ హమ్మ ఫైనల్లీ మా టైగర్ ఎన్టీఆర్ సెట్స్ లో సందడి చేస్తున్నాడు అంటూ ఊపిరి తీసుకుంటున్నారు.