బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ రసాభాసగా ముగిసింది. గీతూ సొంత తెలివితేటలు ఆది రెడ్డిని ఇరుకున పెట్టాయి. బిగ్ బాస్ ఆదిరెడ్డి కెప్టెన్సీ కంటెండర్ అర్హతని లాగేసుకున్నాడు. గీతూ తుప్పాసి ప్లాన్స్ తో కొంతమంది ఈ టాస్క్ లో ఇబ్బంది పడ్డారు. ఇక ఇనాయ సుల్తానా ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని కలలు కనింది.. కానీ చివరికి గీతూ, ఫైమా సపోర్ట్ తో శ్రీ సత్య ఫైనల్ గా తొమ్మిదో వారానికి కెప్టెన్ అయ్యింది. శ్రీహన్-రేవంత్ సపోర్ట్ కూడా శ్రీ సత్యకి ఉండడం ప్లస్ అయ్యింది. అయితే గత వారం గీతూ చేసిన పనుల వలన, ఫైమా వెటకారం కారణంగా, మరీనా వీక్ పెరఫార్మెన్స్ కారణంగా ఈ ముగ్గురు లేడీస్ డేంజర్ జోన్ లో కి వచ్చారు.
గీతూ నిన్నటివరకు లీస్ట్ లో ఉంటే.. గతరాత్రి ఓటింగ్స్ ముగిసేసమయాని రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి వచ్చింది. ఇక ఎనిమిదో స్థానంలో ఉన్న ఫైమా డేంజర్ ప్లేస్ లోకి వెళ్లగా.. మరీనా ఎప్పటిలాగే తొమ్మిదో స్థానంలోనే లోనే ఉంది. బాలాదిత్య, ఇనాయలతో ఫైమా చేసిన నామినేషన్స్ ప్రక్రియ వలనే ఆమె డేంజర్ జోన్ లో ఉండడం, అలాగే ఇనాయతో ఫ్రెండ్ షిప్ విషయంలో జరిగిన గొడవ కారణంగా ఫైమాకి ఆడియన్స్ నుండి సపోర్ట్ తగ్గిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక డేంజర్ జోన్ లో ఉన్న గీతూ లక్కీగా సేఫ్ జోన్ లోకి వెళ్లగా.. ఫైమా మాత్రం డేంజర్ జోన్ లో ఎలిమినేషన్ కత్తికి దగ్గరైంది.