Advertisement
Google Ads BL

జబర్దస్త్ పై ఓపెన్ అయిన సుడిగాలి సుధీర్


మల్లెమాల నుండి, ఈటివి నుండి సుడిగాలి సుధీర్ పూర్తిగా పక్కకి వచ్చెయ్యడం ఆయన ఫాన్స్ కి అస్సలిష్టం లేదు. ఢీ డాన్స్ షో, అలాగే ఎక్స్ట్రా జబర్దస్త్ లో టాప్ పొజిషన్ లో ఉన్న సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా యాంకరింగ్ చేసేవాడు. కానీ మూడు షోస్ కి సుధీర్ గుడ్ బై చెప్పేసి పక్క ఛానల్ కి వెళ్లిపోవడం, ప్రస్తుతం బుల్లితెర మీద అస్సలు కనిపించకపోవడం, జబర్దస్త్ నుండి సుధీర్ ఒక్కసారిగా ఎందుకు తప్పుకున్నాడో తెలియక ఇప్పటికి ఆయన ఫాన్స్ డిస్పాయింట్ అవుతూనే ఉన్నారు. అయితే సుధీర్ అసలు జబర్దస్త్ ని వదిలెయ్యడానికి గల కారణాలని ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

Advertisement
CJ Advs

సుడిగాలి సుధీర్ మల్లెమాల యాజమాన్యం తో ఓ ఆరు నెలల పాటు తన బయటికి వెళ్ళాలి అనుకుంటున్నట్టుగా చెప్పి పర్మిషన్ తీసుకున్నాకే వేరే ఛానల్ కి వచ్చాడట. తనకి ఫైనాన్స్ ప్రోబ్లెంస్ ఉండడంతో మల్లెమాల వాళ్ళని అడ్జెస్ట్ చెయ్యమని అడిగితె, వారు చెయ్యకపోయినందు వలనే తాను బయటికి వచ్చానని, మళ్ళీ ఆరు నెలలు అవ్వగానే జబర్దస్త్ కి వస్తాను అని చెప్పే వచ్చాను అని, నేను ఎప్పడూ సింగింగ్ షోస్ కి యాంకరింగ్ చెయ్యలేదని, అంతేకాకుండా చిన్న పిల్లల ప్రోగ్రాం చెయ్యాలని కొద్దిరోజులు జబర్దస్త్ కి గ్యాప్ తీసుకున్నానని.. ఇప్పుడు నా పనులు పూర్తయ్యాయి, నా ప్రోబ్లెంస్ సాల్వ్ అయ్యాయి.. మళ్ళీ వస్తాను అని జబర్దస్త్ మల్లెమాలకి చెప్పానని, త్వరలోనే జబర్దస్త్ కి వెళ్ళిపోతాను అంటూ సుధీర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పడం తో ఆయన ఫాన్స్ మళ్ళీ సంతోషపడిపోతున్నారు. సుధీర్ ప్రస్తుతం హీరోగా నటించిన గాలోడు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

Sudigali Sudheer on Jabardasth:

Sudigali Sudheer Interview about Jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs