ప్రభాస్ ఫాన్స్ కూల్ అయ్యారు, ప్రస్తుతం వారు ఊపిరి పీల్చుకుంటున్నారు. కారణం ఆదిపురుష్ వాయిదా పడడం. ఆదిపురుష్ టీమ్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా ఆదిపురుష్ వాయిదా అనేది కన్ ఫర్మ్ అయిన న్యూస్. సినిమా వాయిదా పడితే టెన్షన్ పడాల్సిన ప్రభాస్ ఫాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు అంటే.. ఆ సినిమా విషయంలో వాళ్ళెంతగా ఆందోళన పడి ఉండాలి. అంటే ఆదిపురుష్ గురించి ఏదో ఊహించుకుంటే దర్శకుడు ఓం రౌత్ ఇంకేదో చూపించడంతో వారు చాలా డిస్పాయింట్ అయ్యారు. అందుకే సినిమా వాయిదా పడినా పర్లేదు, అసలే రెండు ప్లాప్స్ తర్వాత రాబోతున్న సినిమా ఎలా ఉండాలి. మంచి హైప్ ఉండాలి. కానీ ఆదిపురుష్ కి హైప్ కన్నా ఎక్కువగా నెగెటివిటి ఉంది.. ఇలాంటి టైం లో సినిమా విడుదలైతే ఇంకేమన్నా ఉందా అని వాళ్ళ ఫీలింగ్.
అందుకే వాళ్ళు ఆదిపురుష్ కన్నా ముందుగా సలార్ రావాలని కోరుకుంటున్నారు. సలార్ అయితే మాస్ యాక్షన్ మూవీ. ప్రశాంత్ నీల్ దర్శకుడు. ఒకవేళ ఆదిపురుష్ సమ్మర్ రేస్ లో ఉంటే..సలార్ అంతకన్నా ముందే ఏప్రిల్ లో వచ్చెయ్యాలి అనేది వాళ్ళ కోరిక. ఆదిపురుష్ కన్నా ముందు సలార్ వస్తేనే ప్రభాస్ ఫాన్స్ సంతోషపడేలా ఉన్నారు. సలార్ కి విపరీతమైన క్రేజ్ ఉంది, బజ్ ఉంది.. ఇలాంటి టైమ్ లో సలార్ రావాలి కానీ.. అస్సలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేని ఆదిపురుష్ వస్తే కష్టం అందుకే.. ఆదిపురుష్ వాయిదా పడిన ప్రభాస్ ఫాన్స్ ఫీలవకుండా హ్యాపీ గా ఉన్నారు.