Advertisement
Google Ads BL

షాట్ ఓకే.. నెక్ట్స్? హీరోపై ప్రకాశ్ రాజ్ సెటైర్


హీరో విశాల్‌ చేసిన ట్వీట్‌‌పై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సెటైర్ వేశారు. మొదటి నుంచి మోడీ అంటే ప్రకాశ్ రాజ్‌కి పడదనే విషయం తెలిసిందే. మోడీ విధానాలను, మోడీ తీరును తన ట్వీట్స్‌తో ఎప్పటికప్పుడు ‘justasking’ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రశ్నించే ప్రకాశ్ రాజ్.. మోడీని ఎవరైనా పొగిడినట్లు కనిపించినా.. తట్టుకోలేరు.. ఏదో ఒక పంచ్ విసురుతూనే ఉంటారు. అదే మోడీని తనలాగే ఎవరైనా ప్రశ్నించడమో.. లేదంటే విమర్శించడమో చేస్తే మాత్రం నెత్తిన పెట్టుకుంటూ ఉంటారు. అసలాయనికి మోడీ అనే కాదు.. బిజెపీ విధానాలు, పాలనే నచ్చదు. ఎందుకు నచ్చదు అనేది పక్కన పెడితే.. తాజాగా మోడీని పొగుడుతూ విశాల్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు ప్రకాశ్ రాజ్ ‘షాట్ ఓకే.. నెక్ట్స్..???’ అంటూ సెటైర్ వేశాడు.

Advertisement
CJ Advs

 

కాశీ పుణ్యక్షేత్రంలోని అభివృద్ధిని, రీమోడలింగ్‌‌ని చూసి.. మోదీని మెచ్చుకుంటూ విశాల్ ట్వీట్ చేశాడు. ‘‘మోడీగారు.. నేను కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాను. దర్శనం, పూజ.. ఇలా ప్రతీది అద్భుతంగా అనిపించింది. మీరు అక్కడ చేసిన అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయాను. కాశీని సందర్శించాలనుకునే ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా మార్పులు తెచ్చిన మీకు హ్యాట్సాఫ్.. మీకు సెల్యూట్’’ అంటూ మోడీపై విశాల్ పొగడ్తల వర్షం కురిపించాడు. దీనికి షాట్ ఓకే.. తర్వాతేంటి? అని ప్రకాశ్ రాజ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Prakash Raj satirical tweet on Hero Vishal :

Prakash raj Reaction about Vishal Tweet on Modi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs