హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర కొంతమంది గుర్తు తెలియని వాహనాలతో పాటుగా, అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ ఉండడమే కాకుండా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందిని బూతులు తిట్టారంటూ పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్యూరి గార్డ్స్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చెయ్యడం కలకలం సృష్టించింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా వుంటున్నారు. ఈమధ్యనే ఆయన వైసిపి మంత్రులు, సీఎం జగన్ మీద ఫైర్ అయ్యారు. ఇక వైజాగ్ లో పవన్ కళ్యాణ్ తలపెట్టిన జనవాణి కార్యక్రమం జరగకుండా వైసిపి మంత్రులు ట్రై చేసినా పవన్ కళ్యాణ్ కి వైజాగ్ ప్రజలు బ్రహ్మరధం పట్టారు.
అయితే వైజాగ్ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ఆయన వాహనాలను కొంతమంది వ్యక్తులు అనుసరిస్తున్నారని, అలాగే ఆయన ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు రెక్కీ నిర్వహించారంటూ నాదెండ్ల మనోహర్ ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది ఈ విషయమై పోలీస్ లకి కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తుంది.