Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 6: గీతు టూమచ్ చేస్తుంది


బిగ్ బాస్ హౌస్ లో గీతు చేసే ఓవరేక్షన్ చూడలేక బుల్లితెర ప్రేక్షకులకి విసుగొచ్చేస్తుంది. గత వారం తానే టాస్క్ ప్లేయర్, తానే సంచాలక్ గా, బిగ్ బాస్ గా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది అంటూ హౌస్ మేట్స్ ని మూడు చెరువులు నీళ్లు తాగించిన గీతు కి మొహం వాచిపోయేలా హోస్ట్ నాగార్జున చెడామడా చివాట్లు పెట్టారు. అయినా గీతు ప్రవర్తలో ఈ వారం మార్పు కనిపించలేదు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భుజ బలంతో పాటుగా బుద్ధిబలం కూడా పెట్టొచ్చు అని బిగ్ బాస్ చెప్పడంతో బాలాదిత్య సిగార్ లైటర్ దాచేసి గేమ్ స్టార్ట్ చేసింది. బాలాదిత్య శతవిధాలుగా వేడుకున్నా అతనికి అది ఇవ్వడం లేదు.

Advertisement
CJ Advs

అది రెడ్డి వచ్చి నువ్వు మరో తప్పు చేస్తున్నావ్ దీనివలన గేమ్ ఆగిపోతుంది అని చెప్పినా గీతు వినడం లేదు. రేవంత్, శ్రీహన్ చెప్పినా గీతులో మార్పు లేదు. బాలాదిత్య మరొపక్కన గొడవ పెట్టుకుని చేసేదేం లేక కీర్తి, ఫైమా దగ్గర కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నాడు. నేను సిగరెట్స్ కోసం ఆడడం లేదని, అవుట్ అయ్యానని బయట ప్రొజెక్ట్ అవుతుంది, అమ్మ బాధపడుతుంది అంటూ ఏడుస్తున్నాడు. కానీ గీతు మాత్రం నా గేమ్ ఇదే అన్నట్టుగా ప్రవర్తించడం ఎవ్వరికి నచ్చడం లేదు. మరి గీతు బాలాదిత్యని కావాలనే ఏడిపిస్తుంది అని అందరూ డిసైడ్ అవుతున్నారు. అందుకే ఆమెకి ఓట్స్ కూడా గుద్దడం లేదనే టాక్ వినిపిస్తుండగా.. ఈ రోజు ఎపిసోడ్ ప్రోమోలో బాలాదిత్య ఏడవడం అందరిని కలిచివేసింది. 

Bigg Boss 6: Baladitya crying:

Big Boss 6: Baladitya Crying Again for cigarettes Geetu 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs