Advertisement
Google Ads BL

యాక్సిడెంట్ తర్వాత లైవ్‌లోకి రంభ


రంభ తన పిల్లలతో ప్రయాణిస్తున్న కారుకి నవంబర్ 1 న కెనడాలో జరిగిన యాక్సిడెంట్ విషయాన్ని ఆమె నిన్న రెండో తారీఖున సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది. తన కారుని వేరే కారు గుద్దడంతో యాక్సిడెంట్ జరిగింది అని, కారులో తన పిల్లలు, నాన్నమ్మ ఉన్నారని, ఈ ప్రమాదంలో తాము స్వల్ప గాయాలతో బయటపడగా, కూతురు సాషాకి కొద్దిగా దెబ్బలు ఎక్కువ తగలడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా  ఆమె కొలువలంటూ ప్రార్థనలు చేయమన్న రంభ.. దానితో పాటుగా కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేసింది. అయితే తాజాగా రంభ లైవ్ లోకొచ్చి తన కూతురు పెద్ద ప్రమాదం నుండి బయటపడింది అని, ఆమె కోలుకుంటుంది అని చెప్పింది.

Advertisement
CJ Advs

 

తన పిల్లలని స్కూల్ నుండి తీసుకొచ్చే క్రమంలో తమ కారుని వేరే కారు గుద్దడంతో ఈ ప్రమాదం సంభవించింది అని, మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. నా కూతురు సాషా పూర్తిగా కోలుకుంది. నా కూతురి సాషాకి నయం కావాలని మీరందరు ప్రార్థించడం సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానులు, ఫ్రెండ్స్ కు చాలా కృతజ్ఞతలు అంటూ ఆమె లైవ్ లో చెప్పుకొచ్చింది. రంభ తెలుగు హీరోయిన్ అయినప్పటికీ.. పెళ్లి తర్వాత ఆమె కెనడాలో స్థిరపడింది. మధ్యలో భర్తతో విభేదాలు వచ్చి విడాకుల వరకు వెళ్లినా.. తర్వాత మేటర్ సెటిల్ అయ్యి భర్త పిల్లలతో ఆమె సంతోషంగా గడుపుతుంది.

Rambha says Thanks to Fans:

Heroine Rambha Reaction after accident
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs