గత రాత్రి నామినేషన్స్ లో ఇనాయని టార్గెట్ చేసారు చాలామంది హౌస్ మేట్స్. ఇనాయ వలనే సూర్య ఎలిమినేట్ అయ్యాడంటూ అందరూ ఇనాయనే బ్లేమ్ చేసారు. ఇనాయ ఎంతగా డిఫెండ్ చేసుకున్నప్పటికీ.. ఇనాయ ఓడిపోయింది. ముఖ్యంగా ఆది రెడ్ది, ఫైమా, శ్రీసత్య, శ్రీహన్, రేవంత్ లే ఇనాయని టార్గెట్ చెయ్యడంతో.. ఇనాయ వాదించి వాదించి అలిసిపోయింది. అయితే నామినేషన్స్ ప్రక్రియ ముగియగానే ఇనాయ బెడ్ రూమ్ లో ఉన్న స్పెషల్ వాష్ రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. నేను చాలా గిల్టీ గా ఫీలవుతున్నా అంటూ ఏడుస్తుంది..
అందరూ ఇనాయని వెతుకుతూ బెడ్ రూమ్ లోని వాష్ రూమ్ డోర్ కొట్టినా ఆమె తలుపు తియ్యలేదు. శ్రీసత్య, శ్రీహన్ లు నువ్ బయటికి రా బయటకి వచ్చి ఫ్రీగా ఉండు, నిన్నెవరూ డిస్టర్బ్ చెయ్యరు అన్నప్పటికీ.. ఆమె మాత్రం రాననే చెప్పింది. అంతేకాకుండా బాత్ రూమ్ లో ఏదో కొట్టిన శబ్దం రాగానే.. హౌస్ మేట్స్ కంగారు పడ్డారు. రేవంత్ అయితే బాత్ రూమ్ డోర్ పగలగొడదాం, బోల్ట్ తీసేద్దాం అంటూ కెప్టెన్ శ్రీహన్ పర్మిషన్ అడిగాడు.. మరి ఇనాయ బాత్ రూమ్ డ్రామా మరికాసేపట్లో.. ఈ రోజు మంగళవారం ఎపిసోడ్ లో.. మీ కోసం.