రామ్ చరణ్ దెబ్బకి ఇప్పుడో దర్శకుడు విల విల్లాడిపోతున్నాడు. చాలామంది హీరోలు కొంతమంది దర్శకులతో సినిమాలు ప్రకటించి మధ్యలో ఆ మూవీస్ ని ఆపేస్తూ ఉంటారు. అది సహజంగానే జరుగుతుంటాయి. తాజాగా రామ్ చరణ్ శంకర్ తో RC15 సినిమా చేస్తున్నాడు. తర్వాత కూడా రామ్ చరణ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో కలిసి సినిమా చెయ్యడానికి కమిట్ అయ్యి అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే తర్వాత కొద్దిరోజులుగా RC16 ఆగిపోయింది అంటూ వార్తలు కూడా వచ్చాయి.
ఎందుకంటే హిందీలో గౌతమ్ తిన్ననూరి జెర్సీ రీమేక్ విషయంలో ఫెయిల్ అవడం, అలాగే గౌతమ్ తిన్ననూరి చెప్పిన స్టోరీ లైన్ నచ్చినా.. ఆ పూర్తి స్టోరీ నచ్చక రామ్ చరణ్ ఆలోచనలో పడినట్లుగా చెప్పారు. కానీ నేడు RC16 అధికారికంగా ఆగిపోయినట్లుగా అనౌన్సమెంట్ రావడంతో రామ్ చరణ్ ఇచ్చిన షాక్ కి దర్శకుడు గౌతమ్ కోలుకోవడం మాములు విషయం కాదు అంటున్నారు. పాపం మనోడు కొంత కాలంగా చరణ్ కోసమే వెయిట్ చేస్తున్నాడు.. కానీ ఇప్పుడు ఇలా.. బ్యాడ్ లక్ గౌతమ్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.