Advertisement
Google Ads BL

రంభ కి తప్పిన పెను ప్రమాదం


సినీ నటి రంభ తన ఫ్యామిలీతో కెనడాలో ఉంది. కొన్నాళ్లుగా రంభ నటనకు దూరమై ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. అయితే కెనడాలో రంభ తన కూతురు సాషా తో కలిసి ప్రయాణిస్తున్న కారుకి ఘోరమైన యాక్సిడెంట్ అవడం కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో రంభ తప్పించుకోగా.. ఆమె కూతురు సాషా కి కొద్దిపాటి గాయాలు అవడంతో ఆమెని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా రంభ సోషల్లో మీడియాలో ట్వీట్ చేసింది. రంభ తన కారుకి జరిగిన యాక్సిడెంట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Advertisement
CJ Advs

రంభ కారు వేరే కారుని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది అని, కారు కి జరిగిన యాక్సిడెంట్ చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అయినప్పటికి .. రంభ కి ఆమె కూతురికి పెను ప్రమాదం తప్పినట్లుగా రంభ ట్వీట్ చేసింది. కారు ఫొటోలతో పాటుగా తన కూతురు సాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోస్ ని కూడా షేర్ చెయ్యడంతో.. ఆమె అభిమానులు ముందు ఆందోళన పడినా.. చిన్నపాటి గాయాలతో తప్పించుకున్నందుకు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

Rambha and her children injured in car accident:

Rambha and her children injured in car accident in Canada
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs