నందమూరి నటసింహం వీర సింహ రెడ్డి గా గర్జించడానికి రెడీ అవుతున్నారు. సంక్రాంతికి వీర సింహ రెడ్డి గా బాలయ్య నట విశ్వరూపం, మాస్ యాక్షన్ తో అదరగొట్టెయ్యడానికి రెడీ అవుతుంటే.. మాస్ ఫాన్స్ ఆయన గర్జన వినడానికి, చూడడానికి తెగ వెయిట్ చేస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకుడిగా బాలయ్యని నెక్స్ట్ లెవల్ మాస్ అవతార్ లో చూపించబోతున్నాడు. టైటిల్ కి తగ్గట్టుగా పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్, అలాగే పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయట
తాజాగా వీర సింహ రెడ్డి పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది సినిమాలో ఇంటర్వెల్ సందర్భంలో వచ్చే ఓ ట్విస్ట్ వీర సింహ రెడ్డికే హైలెట్ గా నిలబోతుందట. ఆది ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గరే బాలకృష్ణ-హీరోయిన్ శ్రుతి హాసన్ క్యారెక్టర్లకు సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవుతుందని.. ఆ ట్విస్ట్ సినిమా మొత్తంలోన చాలా ఎమోషనల్ గా ఉండడమే కాకుండా సినిమాకే హైలెట్ గా నిలవబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ట్విస్ట్ ని దర్శకుడు గోపీచంద్ చాలా ఇంట్రెస్టింగ్ గా మలిచారని సమాచారం.