Advertisement
Google Ads BL

వాయిదా పడిన ఆదిపురుష్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండి రెండు డిసాస్టర్ చూసిన ప్రభాస్ ఫాన్స్ ఆయన నుండి రాబోతున్న ఆదిపురుష్ పై అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆదిపురుష్ టీజర్ వాళ్ళని బాగా డిస్పాయింట్ చేసింది. అయినప్పటికీ 3D లో ఆదిపురుష్ టీజర్ చూసి కాస్త చల్లబడిన ఫాన్స్.. సినిమా కోసం జనవరి 12 వరకు వెయిట్ చేద్దామని ఆగారు. అయితే సంక్రాంతికి రిలీజ్ కావల్సిన ఆదిపురుష్ ని మొన్నామధ్యన జనవరి 6 కే ప్రీ పోనే చేసే యోచనలో ఉన్నట్లుగా చెప్పినప్పటికీ.. ఇప్పుడు జనవరి నుండి ప్రీ పోన్ కాదు పోస్ట్ పోన్ అయ్యింది. ఆదిపురుష్ జనవరి 12 న విడుదల కావడం లేదు.

Advertisement
CJ Advs

కారణం VFX మరియు CGI వర్క్‌ లు లేట్ అవడమే అంటున్నారు. అద్భుతమైన VFX మరియు CGI వర్క్‌లతో ఆడియన్స్ ముందుకు రావాలని.. దానికి తగిన సమయం ఆవరసరం అని మేకర్స్ భావిస్తున్నారట. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి చిరు-బాలయ్యల సినిమాలే థియేటర్స్ ని ఆక్యుపై చేస్తాయి. అప్పుడు ఆదిపురుష్ కి తక్కువ థియేటర్స్ దొరుకుతాయి. అలాగే ఓపెనింగ్స్ కూడా తగ్గుతాయని భావించి సినిమా పోస్ట్ పోన్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఆదిపురుష్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో కానీ, మే లో కానీ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

Adipurush Out Of Sankranthi Race:

Prabhas Adipurush Postponed 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs