Advertisement
Google Ads BL

బిగ్ బాస్ లో అలా ఉండడం తప్పే


బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ 5 కి వెళతాడనుకున్న RJ సూర్య అనూహ్యంగా అంటే ఓటింగ్ తో సంబంధమే లేకుండా ఎనిమిదో వారంలో బయటికి రావడం ఆయన ఫాన్స్ కే కాదు, మిగతా హౌస్ మేట్స్ కి బుల్లితెర ప్రేక్షకులకి పెద్ద షాక్. సూర్య ఖచ్చితంగా టాప్ 5 అనుకున్నారు. కానీ ఎనిమిదో కంటెస్టెంట్ గా సూర్య హౌస్ ని వదిలేసాడు. సూర్య కన్నా వీక్ కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. వారిలో ముఖ్యంగా రాజ్, వాసంతి, మరీనా లాంటి వాళ్ళు హౌస్ లో ఉండి సూర్య బయటికి రావడం అందరిని ఆలోచనలో పడేసింది. అయితే సూర్య ఫెమినిస్ట్ అంటూనే వాసంతిని చీట్ చెయ్యడం ఇష్టం లేని బుల్లితెర ప్రేక్షకులు అతనికి ఓట్స్ వెయ్యలేదనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. సూర్య ఆరోహితో, ఇనయతో చేసిన ఫ్రెండ్ షిప్ నచ్చకే ఇలా సూర్య ఎలిమినేట్ అయ్యాడని అనుకుంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే సూర్య బయటికి వచ్చాక ఇనయతో, ఆరోహి తో మీరు హగ్గులు, ముద్దులు అంటూ రెచ్చిపోవడం వలనే ఎలిమినేట్ అయ్యారేమో అన్నారు. దానికి సూర్య ఫ్రెండ్స్ మధ్యన హగ్గులు, ముద్దులు ఉండడం తప్పు అంటే నేను హౌస్ లో తప్పు చేసినట్టే. కానీ  మేము ఫ్రెండ్ షిప్ మాత్రమే చేసాం అంటూ చెప్పాడు. BB కేఫ్ శివ ఇంటర్వ్యూలో సూర్య ఇనయతో పెట్టుకున్న ట్రాక్ నచ్చలేదు అంటే.. అక్కడ నా తప్పు లేదు, ఇనయనే అలా చేసింది అంటే.. నేనంటే ఇష్టమని చెప్పింది అన్నాడు సూర్య. మరి ఇనాయ నువ్వు టాప్ 5 లో ఉండకూడదు, ఎలిమినేట్ అవ్వాలని రేవంత్ తో చెప్పిన వీడియో చూడమనగానే సూర్య షాకైపోయాడు. మరి సూర్య కూడా ఇనాయ తనకి వెన్నుపోటు పొడిచింది అని ఇప్పుడు ఫీలవుతాడేమో చూద్దాం.

It is wrong to be like that in Bigg Boss: RJ Surya:

RJ Surya Interview after eliminated
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs