గత శుక్రవారం పొలోమని నాలుగు సినిమాలు థియేటర్స్ మీద దాడికి దిగాయి. ఓరి దేవుడా, జిన్నా, ప్రిన్స్, సర్దార్.. ఒకదాని మీద ఒకటి పోటీ పడి ఆడియన్స్ నుండి సక్సెస్ అనిపించుకుందామనుకున్నాయి. దివాళి కి హిట్ కొట్టి సెలెబ్రేషన్స్ చేసుకుందామనుకున్నారు మేకర్స్. సర్దార్, ఓరి దేవుడా, జిన్నా, ప్రిన్స్ నాలుగు సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి. కానీ కాంపిటీషన్ ఎక్కువగా ఉండడంతో.. ఓరిదేవుడా, జిన్నా లాంటి కంటెంట్ ఉన్న సినిమాలు లాస్ అయ్యాయి. అదే గనక ఆ వారం పోటీకి దిగకుండా ఓ వారం గ్యాప్ ఇచ్చి ఈ శుక్రవారం కూల్ గా రిలీజ్ అయ్యి ఉంటే.. ఫలితం ఎలా ఉన్నా కలెక్షన్స్ పరంగా మంచి నెంబర్లు ని కోట్ చేసేవి.
ఎందుకంటే ఈ ఫ్రైడే విడుదలైన సినిమాలేవీ ఆడియన్స్ ని అలరించలేకపోయాయి. ఈ వారం డ్రై ఫ్రైడే గా మిగిలిపోయింది. సో ఈ శుక్రవారం గనక జిన్నా, ఓరి దేవుడా ని రిలీజ్ చేసినట్టయితే..
ఆడియన్స్ నుండి ఆ సినిమాలకి మంచి రెస్పాన్స్ దక్కేది. కలెక్షన్స్ పరంగాను నిర్మాతలకు కాసులు కురిపించేవి. జస్ట్ వన్ వీక్ వెయిట్ చేసి ఉంటే.. ఈ రెండు సినిమాల విషయంలో నిర్మాతలు, మూవీ టీమ్స్ సంతోషంగా ఉండేవి. ఆ సినిమాలు లాభపడేవి.