కన్నడ కాంతార ఇప్పటికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిస్తున్న సినిమా. కాంతార ని పొగిడేవారి సంఖ్య ఇంకా ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంది. విమర్శకుల సైతం కాంతార ని పొగిడినవారే, పొగడని వారు లేరు. బాలీవుడ్ టు టాలీవుడ్ ప్రముఖులు కాంతార పై ప్రశంశలు కురిపించారు. ఈమధ్యనే తమిళ సూపర్ స్టార్ కాంతారని వీక్షించి టీమ్ తో పాటుగా, హీరో రిషబ్ శెట్టిని సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకముగా అభినందించారు.
అంతేకాదు రజినీకాంత్ రిషబ్ శెట్టిని ప్రత్యేకంగా కలిసి అభినందించిన విషయాన్ని రిషబ్ శెట్టి అందరితో పంచుకున్నాడు. రిషబ్ శెట్టిని రజినీ తన ఇంటికి పిలిచి మరీ సన్మానించారు. రిషబ్ ని రజినీకాంత్ ప్రశంసిస్తుంటే.. రిషబ్ శెట్టి గౌరవంతో రజినీ కాళ్ళకి పాదాభివందనం చేసిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మీరు ఒక్కసారి మెచ్చుకుంటే 100 సార్లు మెచ్చుకున్నట్టే.. చాలా థాంక్స్ రజినీ సర్.. మా కాంతారని చూసినందుకు.. చాలా సంతోషంగా ఉంది అంటూ ఆనందంతో రిషబ్ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.