మహేష్ బాబు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో. ఇప్పుడు రాజమౌళి తో సినిమా అనౌన్సమెంట్ రాగానే.. అందరి చూపు మహేష్ మీదే ఉంది. పాన్ ఇండియా మూవీ గా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ కౌవ్ బాయ్ గెటప్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. అయితే మహేష్ బాబుకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అటు ట్విట్టర్, ఇటు ఫేస్ బుక్, ఇన్స్టా ఇలా ఎందులో చూసినా మహేష్ బాబుకి విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా మహేష్ బాబుకి ట్విట్టర్ లో ఆయన్ని ఫాలో అయ్యే వారి సంఖ్య 13 మిలియన్స్‌కి చేరుకుంది. సౌత్ ఓ హీరోకి ట్విట్టర్‌లో ఉన్న ఫాలోవర్స్ సంఖ్య పరంగా చూసుకుంటే మహేష్ బాబే నెంబర్ వన్.
దానితో మహేష్ ఫాన్స్ రెచ్చిపోయి పండగా చేసుకోవడం తో పాటుగా.. సోషల్ మీడియాలో మహేష్ ని ట్రెండ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ లండన్ లో ఉన్నారు. ఆయన హైదరాబాద్ కి రాగానే నవంబర్ మొదటి వారం నుండి త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 షూటింగ్ లో పాల్గొంటారు. ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరున విడుదలకాబోతుంది. దాని తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో కలిసి పాన్ ఇండియా మూవీకి పని చేస్తారు.