Advertisement
Google Ads BL

మెగాస్టార్ మరోసారి మాస్ ట్రీట్!


రీసెంట్‌గా వచ్చిన ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి మెగాస్టార్ మాస్ ట్రీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. చిరు, సల్మాన్ ‘థార్ మార్ థక్కర్ మార్’ అంటూ హుక్ స్టెప్స్‌తో అలరించారు. ఇప్పుడలాంటి మాస్ ట్రీట్‌నే మరోసారి ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్. ఈసారి మెగాస్టార్‌తో కలిసి ఊర మాస్ స్టెప్పులేయబోతుంది ఎవరో తెలుసా? మాస్ మహారాజా రవితేజ. మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రలో రవితేజ నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి నటించడమే కాకుండా.. ఇద్దరిపై ఓ మాస్ సాంగ్ కూడా ఉంటుందని చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది. 

Advertisement
CJ Advs

 

తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ని చిత్రయూనిట్ ప్రకటించింది. చిరంజీవి, రవితేజలపై మాస్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. చిరంజీవి, రవితేజ గ్రేస్ ఫుల్ మూవ్స్, ఎనర్జీతో అలరించేలా మాస్ డ్యాన్స్ నంబర్‌‌ను ట్యూన్ చేశారని.. శేఖర్ మాస్టర్ అద్భుతంగా ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారని.. భారీ సెట్‌‌లో చిత్రీకరించిన ఈ మాస్ నంబర్‌లో వీరిద్దరినీ చూడటం అభిమానులకు కన్నుల పండగగా ఉండబోతుందని మేకర్స్ తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌లో మెగాస్టార్ వింటేజ్ అవతార్‌‌లో కనిపించి మెస్మరైజ్ చేశారు. ఈ టీజర్‌లో మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్, గెటప్, మ్యానరిజమ్స్ అన్నీ మెగాభిమానులకు పూనకాలు తెప్పిస్తే.. ఇప్పుడు మాస్ సాంగ్ అంటూ ఫ్యాన్స్‌ని మరింతగా మేకర్స్ ఎగ్జయిట్ అయ్యేలా చేస్తున్నారు.

Chiranjeevi - Ravi Teja Mega Massy Song In Waltair Veerayya:

Waltair Veerayya: Mega Masssy song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs