Advertisement
Google Ads BL

గల్లీ కాదు ఢిల్లీ రాజకీయాలు చేయాలి కేసీఆర్!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలలో తన సత్తా చూపాలని ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ప్రధాని మోడీ తో ఢీ  అంటే ఢీ  అంటున్నాడు. మునుగోడు ఉప ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని సర్వశక్తులను ఒడ్డుతున్నాడు. దానికి తగ్గట్టుగానే రెండురోజుల క్రితం తన పార్టీ ఎం.ఎల్.ఏ లను బి.జె.పి  కోట్లు ఎర  చూపి మభ్యపెట్టిందని వీడియోలు విడుదలచేసి సంచలన ఆరోపణలు చేసారు.

Advertisement
CJ Advs

 

అయితే కె.సి.ఆర్ గురించి తెలిసిన వారెవ్వరూ ఈ ఆరోపణలను నమ్మడంలేదు. ఎందుకంటే కొంత కాలం క్రితం బలమైన ప్రత్యర్థి టి.డి.పి  ని ఎదుర్కొనేందుకు, రేవంత్ రెడ్డి ని ఇదే విధంగా ఇరికించి చంద్రబాబుపై ఆరోపణలు చేసి, నామరూపాలు లేకుండా చేసాడు. ప్రతిసారి ఒకే విధమైన రాజకీయ ఎత్తులు వేస్తే  ప్రత్యర్థులే కాదు, ప్రజలుకూడా నమ్మరని కె.సి.ఆర్ కి ఎందుకో అర్థం అవడంలేదు. అయినా తన పిచ్చికాని, కె.సి.ఆర్ లాంటి ఒక చిన్న రాష్ట్ర నాయకుడు, దేశాన్ని ఉద్దరించాలని కంకణం కట్టుకుంటుంటే, దేశాన్ని ఏలుతున్న మోడీ, 20 ఎం.పి  సీట్లు కూడా లేని రాష్ట్రంలో ఎం.ఎల్.ఏ లను, అదీ, ఎన్నికలకు ఒక సంవత్సరం ఉండగా, ఏమాత్రం అధికారంలోకి వచ్ఛే అవకాశం లేకపోయినా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారా.

 

మోడీ పై కె.సి.ఆర్ ఆరోపణలు చేయాలనుకుంటే, తన పార్టీ ఎం.పీ లను కొనుగోలుచేయడానికి చూస్తున్నారని చెప్పుంటే అతికినట్లు ఉండేది. కేసీఆర్ చేష్టలు చూసి, ఇంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏ విధంగా చిన్న పిల్లాడిలా మోడీ పై ఎగిరెగిరి పడ్డాడో, అలానే చేస్తున్నాడు అనిపిస్తోంది. అందుకే, కేసీఆర్, గల్లీ కాదు ఢిల్లీ రాజకీయాలు చేయాలి.. అందుకు నువ్వు ఇంకా ఎదగాలి.

KCR Should learn Delhi Politics Not Galli Politics:

Mudugodu By Election KCR Plan Failed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs