Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 6: ఈ వారం డేంజర్ జోన్ లో..


బిగ్ బాస్ 6 ఏడు వారాలు ఆట పూర్తయ్యి ఎనిమిదో వారం ఆట కూడా ముగిసే సమయం ఆసన్నమైంది. ఈ వారం ఏకంగా ఇంట్లో ఉన్న మొత్తం 14 మంది నామినేషన్స్ లో ఉండడంతో.. హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ విషయంలో రెచ్చిపోయి ఆడేసారు. ఒంటినిండా దెబ్బలు తగిలించుకున్నాసరే ఎక్కడా తగ్గలేదు. కీర్తి, వాసంతి, మరీనా, రోహిత్, రాజ్ ఇలా వీక్ కంటెస్టెంట్స్ అంటున్నవారంతా ఈ వారం తమ ప్రతాపం చూపించేసారు. ఇక ఈ వారం సింగర్ రేవంత్ మీద గీతు మాములుగా రివెంజ్ తీర్చుకోలేదు. సంచాలక్ గా తనకిష్టమైన రూల్స్ పెట్టి రేవంత్ తాట తీసింది గీతు. చివరిగా శ్రీహన్-సూర్య-కీర్తి కెప్టెన్సీ టాస్క్ లో హౌస్ మద్దతు విషయంలో పోటీ పడుతున్నారు. ఫైనల్ గా శ్రీహన్ ఎనిమిదో వారం కెప్టెన్ అయినట్లుగా లీకులు చెబుతున్నాయి.

Advertisement
CJ Advs

ఈ వారం హౌస్ లో ఉన్న 14 మంది నామినేషన్స్ లో ఉండడంతో.. హౌస్ నుండి ఎనిమిదో కంటెస్టెంట్ గా ఎవరు బయటికి వెళతారో అనే విషయమై అందరిలో ఆశక్తి మొదలయ్యింది. ఓటింగ్ పరంగా రేవంత్-శ్రీహన్ మొదటి రెండు స్థానాల్లో స్ట్రాంగ్ గా కనబడుతున్నారు. తర్వాత స్థానాల్లో మాత్రం రోజుకొకరు ఉంటున్నారు. గీతు మూడో ప్లేస్ లో ఉండగా.. నాలుగో స్థానంలో మరీనా, ఐదో ప్లేస్ లో ఆది రెడ్డి, అలాగే ఆరో స్థానంలో ఇనాయ ఉన్నట్లుగా తెలుస్తుంది. తర్వాత స్థానాల్లో వరసగా.. ఫైమా, బాలాదిత్య, రోహిత్, కీర్తి భట్, వాసంతిలు ఉండగా.. చివరి మూడు స్థానాల్లో రాజ్, సూర్య, శ్రీసత్య ఉన్నారని.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు బయటికి వెళ్లే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి లాస్ట్ వీక్ లా ఏదైనా ట్విస్ట్ ఇచ్చి.. వేరొకరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

Bigg Boss 6: This week in danger zone:

Bigg Boss 6: 8th week 3 contestants in danger zone
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs