టాలీవుడ్ లో అవకాశాలు కరువై.. బాలీవుడ్ లో వరస అవకాశాలు అందిపుచ్చుకుంటూ టాప్ హీరోయిన్ గా జెండా ఎగరేద్దామనుకున్న రకుల్ కి అక్కడ కూడా వరసగా షాక్ లే తగులుతున్నాయి. బాలీవుడ్ భామల మాదిరి జీరో సైజ్ లోకి మారిపోయి గ్లామర్ షో చేస్తున్నా పాపని పట్టించుకోవడం లేదు. అటు సినిమాల పరంగా ఎప్పుడూ బిజీగా వుండే రకుల్.. సోషల్ మీడియా లో గ్లామర్ షో అంటూ అందాలను విరివిగా ఆరబోస్తుంది. రకుల్ ప్రీత్ ఈ మధ్యన దివాళి సెలెబ్రేషన్స్, అలాగే ఆమె నటించిన థాంక్ గాడ్, డాక్టర్ G ప్రమోషన్స్ కోసం అడ్డుఅదుపులేని అందాలు ఆరబోతకు దిగింది.
కానీ రకుల్ ప్రీత్ కి థాంక్ గాడ్ షాకిచ్చింది. రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయిన రామ్ సేతు, థాంక్ గాడ్ మూవీస్ ని ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. రెండు సినిమాలకి డిసాస్టర్ టాక్ వచ్చింది. అసలు థాంక్ గాడ్ కానీ, రామ్ సేతు విషయాలేవీ మీడియాలో హైలెట్ అవ్వడం లేదు. అజయ్ దేవగన్, సిద్దార్థ్ మల్హోత్రా నటించిన థాంక్ గాడ్ నార్త్ ఆడియన్స్ ఆకట్టుకోలేదు. బాలీవుడ్ లో ఈ దివాళిని డిసాస్టర్ దివాళి అంటూ అక్కడి క్రిటిక్స్ కూడా తేల్చేసారు. రకుల్ ప్రీత్ అక్కడ వరసగా సినిమాలు చేస్తుంది.. కానీ వరసగా ఆమెకి షాక్ లే తప్ప సక్సెస్ లు లేవు. ఇక రాబోయే డాక్టర్ G అయినా రకుల్ ని ఆదుకుంటుందేమో చూడాలి.