Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ తో అలా విజయ్ ఇలా: జాన్వీ ముచ్చట్లు


బాలీవుడ్ చిన్నది జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు టాలీవుడ్ లో అడుగుపెడుతుందా అని శ్రీదేవి అభిమానులు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. జాన్వీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సౌత్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది అని, విజయ్ దేవరకొండ తో సౌత్ లోకి దిగబోతుంది అని పలుమార్లు ప్రచారం జరగడమే కానీ.. ఇంతవరకు ఆ పని జరగలేదు. అక్కడ బాలీవుడ్ లో కూర్చుని ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ల గురించి మాట్లాడుతుంది కానీ.. ఇక్కడ సినిమా ఒప్పుకున్నది లేదు. అదలా ఉంటే.. జాన్వీ కపూర్ తాజాగా అక్కడ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Advertisement
CJ Advs

మీకు గనక స్వయంవరం పెడితే ఏ హీరోలని చూజ్ చేసుకుంటావ్ అని అడిగిన ప్రశ్నలకి రణబీర్, టైగర్ అంటూ సమాధానం చెప్పింది జాన్వీ కపూర్. కానీ ఇప్పటికే రణబీర్ కి పెళ్లయిపోయింది సింగిల్ స్టేటస్ ఉన్న హీరో పేరు చెప్పండి.. పోనీ విజయ్ దేవరకొండ తో అని అడగగానే.. ఆయనకి ప్రాక్టికల్ గా పెళ్ళైపోయింది అంటూ ఫన్ చేసింది. అంతేకాకుండా సౌత్ లో తాను జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నట్లుగా మరోమారు ఎన్టీఆర్ పేరు తెరపైకి తీసుకుని వచ్చింది జాన్వీ.

Janhvi Kapoor on Vijay Devarakonda and NTR:

Janhvi exposes Vijay Deverakonda, loves NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs