ప్రపంచంలోని తెలుగు వారంతా వై.ఎస్.జగన్ కోరలు పీకేదెవరు అని మాట్లాడుకుంటున్నారు. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని ఏడుపు మొహం పెట్టుకుని ప్రతి నిమిషం ప్రజలముందు సాగిలపడితే, పోనీలెమ్మని, వై.ఎస్. రాజేశేఖర రెడ్డి ఎంతో కొంత చేశాడు కదా, అతని కొడుకే కదా, అవినీతి ఆరోపణలు ఉన్నా, ఎవరిపై లేవు అవినీతి ఆరోపణలు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మరియు ఆమె వంతపాడేవాళ్లు కక్షగట్టి జగన్‌ని జైలుకు పంపించారని, నిండా ముంచకపోయినా, నీట ముంచి కొన్ని మంచి పనులైనా చేస్తాడని నమ్మి అధికారం అప్పగిస్తే, ఆ అధికార మదంతో, మదించిన ఏనుగువలె అందరినీ తన కాళ్ళ క్రింద అణచివేయసాగాడు. అంతటితో ఆగకుండా, అందరిమీద విషం చిమ్ముతూ, కోరి పాముకి పాలు పోసి పెంచకూడదనే సామెతను గుర్తుకు తెప్పించాడు.
అందరూ జగన్ కబంధహస్తాలలో ఉక్కిరిబిక్కిరి అవుతుండటంతో, తమని ఎవరు కాపాడతారా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి విష సర్పం జగన్ కోరలు పీకేదేవరు. చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తాడా అంటే, తమకి ఎదురైన ఘోర పరాజయం నుండి ఇంకా బయటకి రాక, చేష్టలుడిగి చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఉద్రేకపూరిత, ఉత్తేజపూరిత ప్రసంగాలు చేస్తున్నా, అతని అభిమానులే అతనికి ఓట్లు వేస్తారా అనే సందేహాలు ఉన్నాయి. ఈ పరిణామం వల్లే పవన్ కళ్యాణ్ పోయిన ఎన్నికలలో పరాజయం పొందాడు.
బి.జె.పి ఏమైనా చేస్తుందా.. అంటే, ప్రజలకి ఆ పార్టీ పై నమ్మకం ఇసుమంతైనా లేదు. మోడీ పార్టీ తన కళ్ళని తానే ఆంధ్రలో పొడుచుకొంటోంది. జగన్‌కి వత్తాసు పలుకుతూ జనాగ్రహం చవిచూస్తోంది. అయినా, మోడీ తలుచుకుంటే, జగన్‌కి చిప్పకూడే. కోరలు పీకేసి కుక్కిన పేనులా పడేయగలడు.. కానీ దానికి మోడీ సిద్ధమవ్వాలి కదా. ఇక మిగిలింది కే.సి.ఆర్. భారత్ రాష్ట్ర సమితి పేరుతో దేశమంతా విస్తరించాలని, ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కే.సి.ఆర్‌కి ఆంధ్రలో మంచి పేరే వుంది మరి అతను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాడో.!