Advertisement
Google Ads BL

పవర్‌స్టార్ ఎవరని ప్రశ్నించిన అమెరికా నటి


రెబెక్కా గ్రాంట్ అనే అమెరికా నటి అందరిని ఆశ్చర్యపరుస్తూ, టాలీవుడ్ పవర్‌స్టార్ ఎవరు? అంటూ ఆత్రం ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ చిత్రం విదేశాలలో అందరినీ మైమరిపిస్తున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు కైవసం చేసుకుని ఆస్కార్ దిశగా పయనిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రం, అమెరికా సాటర్న్ అవార్డ్స్‌లో బెస్ట్ అంతర్జాతీయ చలన చిత్ర పురస్కారం దక్కించుకుంది. రాజమౌళి ఈ సమయంలో అందరికీ ధన్యవాదాయాలు తెలుపుతూ, తన బాహుబలి ది కంక్లూజన్ కూడా సాటర్న్ అవార్డ్స్ గెల్చుకున్నందుకు ఆనందం వ్యక్తం చేశాడు.

Advertisement
CJ Advs

 

ఇలాంటి సమయంలో, రెబెక్కా గ్రాంట్ సామాజిక మాధ్యమాలలో తన అభిప్రాయాలు పంచుకుంటూ ‘‘ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇంత బ్రేకవుట్ హిట్‌గా ఎలా నిలిచింది? నేను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది!’’ అని ట్వీట్ చేసిన తర్వాత ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ చరణ్, ప్రభాస్‌ల ముందు చిరంజీవి పవర్ మెగాస్టారా? ఏ తెలుగు చిత్రాన్ని నేను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడాలి’’ అని అడిగింది. తెలుగు హీరోల గురించి, తెలుగు చిత్రాల గురించి, ఒక అమెరికా నటి అడుగుతుండటంతో, సినీ ప్రియులందరూ ఉబ్బితబ్బిబవుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆర్.ఆర్.ఆర్. ని జపాన్ దేశంలో ప్రచారం చేస్తున్నారు. రెబెక్కా గ్రాంట్ విషయానికి వస్తే.. ఆమె అస్తమానం ఈ ‘పవర్‌స్టార్’ ట్యాగ్‌తోనే ట్వీట్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో క్రేజ్‌ని సొంతం చేసుకుంటోంది.

Who is Power star asked American Actress :

Rebecca Grant Tweeted about Power Star
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs