Advertisement
Google Ads BL

అల్లువారి వేడుకకు బాలయ్య వస్తొండు!


అల్లు ఫ్యామిలీకి బాలయ్య దగ్గరవుతున్నాడా? లేదంటే బాలయ్యకు అల్లు ఫ్యామిలీ దగ్గరవుతుందా? ఏమో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఏదో జరుగుతుంది. వాస్తవానికి ఈ రెండు ఫ్యామిలీలకు మధ్య ఉన్న స్నేహబంధం ఇప్పటిది కాదు. లెజెండ్ నందమూరి తారక రామారావు, అల్లు రామలింగయ్య కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. ఎన్టీఆర్, అల్లు రామలింగయ్యల స్నేహం గురించి ‘ఆహా’ వేదికపై బాలయ్య, అల్లు అరవింద్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ బంధాన్ని వీరిద్దరూ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ టాక్ షో కు వెళ్లని బాలయ్య.. అరవింద్ కోసం ‘ఆహా’ టాక్ షో హోస్ట్‌గా గర్జిస్తున్నారు. ఆ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అఖండ’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అల్లు వారి సినిమా వేడుకకు నందమూరి బాలకృష్ణ హాజరు కాబోతున్నారు.

Advertisement
CJ Advs

 

అల్లు శిరీష్ హీరోగా ‘విజేత’ ఫేమ్ రాకేశ్ శశి తెరకెక్కించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నవంబర్ 4న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నందమూరి నటసింహం బాలయ్య ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ సినిమా రేంజే మారిపోయింది. అల్లు శిరీష్ సినిమాకి బాలయ్య హాజరవడం ఏమిటని అంతా ఆశ్చర్యపోతున్నప్పటికీ.. ఇది ‘ఆహా’ బంధమని క్లియర్‌గా అర్థమవుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం.. బాలయ్యలో ఛేంజ్ వచ్చిందా? లేదంటే అల్లు వారే కలుపుకుపోతున్నారా? అనేది అర్థం కావడం లేదు. చూద్దాం.. ముందు ముందు ఏం జరగబోతోందో?

Nandamuri Balakrishna Chief Guest for Allu Sirish film Event:

Nandamuri Balakrishna grace the Pre-Release event of Urvasivo Rakshasivo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs