సమంత కొన్నాళ్లుగా సోషల్ మీడియాకే కాదు, పబ్లిక్ అప్పీరియన్స్‌కి కూడా గ్యాప్ తీసుకుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఏదో ఒక విషయంలో మీడియాలో కనిపించిన సమంత.. గ్లామర్ విషయంలో విపరీతంగా ఎక్స్‌పోజ్ అయ్యింది. అందాల ఆరబోతలో హద్దులే లేవు అంటూ రెచ్చిపోయింది. బాలీవుడ్ ఆఫర్స్‌తో, పాన్ ఇండియా మూవీస్‌తో సమంత క్రేజీ హీరోయిన్‌గా మారింది. కానీ కొద్ది రోజులుగా సమంత కనిపించడం లేదు. ఏదో చర్మ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతూ.. ట్రీట్మెంట్ కోసం ఆమె విదేశాలకు వెళ్ళిందనేలా వార్తలు వచ్చాయి. రీసెంట్‌గా ఆమె ఒక యాడ్ షూట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. వెంటనే ఆమె రెమ్యునరేషన్ పెంచేసింది, మూడు కోట్ల నుండి ఎనిమిది కోట్ల దాకా డిమాండ్ చేస్తుంది అంటూ ప్రచారము షురూ అయ్యింది.
అయితే తాజాగా సమంత నుండి వచ్చిన లుక్ విషయంలో అనేక అనుమానాలు రేజ్ అయ్యాయి. సమంత లుక్ పూర్తిగా మారిపోయింది. కాస్త ఒళ్ళు చేసింది. మొహంలో ఏదో తెలియని మార్పు కనిపించడంతో.. ఇప్పుడు సమంత విదేశాలకి వెళ్ళింది స్కిన్ ట్రీట్మెంట్ కోసం కాదు.. ఆమె ఏదో సర్జరీ చేయించుకుందనేలా వార్తలు మొదలయ్యాయి. అందుకే సోషల్ మీడియాకి గ్యాప్ తీసుకుందని అంతా కామెంట్స్ చేస్తున్నారు. సమంత ఏ సర్జరీ చేయించుకుందో తెలియదు కానీ, ఆమె కొత్త లుక్‌కి ఆ సర్జరీనే కారణమంటూ గుసగుసలు కూడా మొదలైపోయాయి.