Advertisement
Google Ads BL

మహేష్ సినిమాలో బాలీవుడ్ హీరో


మహేష్ బాబు త్రివిక్రమ్ తో చెయ్యబోయే మూవీ సెకండ్ షెడ్యూల్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈమధ్యనే మహేష్ ఇటలీ వెళ్లారు. అక్కడి నుండి తిరిగిరాగానే మహేష్ బాబు త్రివిక్రమ్ తో SSMB28 సెట్స్ లోకి జాయిన్ అవుతారు. ఈ సినిమాలో మహేష్ తో పూజ హెగ్డే రొమాన్స్ చేస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే తాజాగా మహేష్ తో SSMB28 లో తలపడబోయే విలన్ విషయంలో ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. అది ఓ బాలీవుడ్ హీరో మహేష్ తో ఫైట్ చెయ్యడానికి రెడీ అయ్యారనే టాక్ వినిపిస్తుంది. 

Advertisement
CJ Advs

ఈ మధ్యన కె.జి.ఎఫ్ లో అధీరా గా అందరిని భయపెట్టిన సంజయ్ దత్ మహేష్ తో SSMB28 లో తలపడబోతున్నారని అంటున్నారు. అలా వైకుంఠపురములో సముద్రఖని తో చేయించిన ఓ డిఫరెంట్ విలన్ లా సంజయ్ దత్ ని SSMB28 లో చూపించబోతున్నారని, సంజయ్ దత్ కేరెక్టర్ ని స్టైలిష్ గానే డిజైన్ చేయబోతున్నారట త్రివిక్రమ్. అలాగే సంజయ్ దత్ కేరెక్టర్ కి పొలిటికల్ టచ్ కూడా ఇవ్వబోతున్నారట. అందులో నుండే నెగటివ్ కేరెక్టర్ ని బయటికి తీస్తారట. మరి ఈ క్రేజీ న్యూస్ లో ఎంత నిజముందో అనేది మేకర్స్ ప్రకటిస్తేనే కానీ క్లారిటీ రాదు.

Sanjay Dutt to lock horns with Mahesh Babu?:

KGF 2 Villain For Mahesh Babu SSMB28?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs